Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namaz Row: గుజరాత్ యూనివర్సిటీలో ఏడుగురు విదేశీ విద్యార్థుల వర్సిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడం వివాదాస్పదమైంది. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన ఆరుగురు, తూర్పు ఆఫ్రికాకు చెందిన మరో విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయడంతో గొడవలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, వీరిని హాస్టల్ ఖాళీ చేయాల్సిందిగా యూనివర్సిటీ కోరింది. మార్చి 16 దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్ఘన్, గాంబియన్ ప్రతినిధి బృందం యూనివర్సిటీ భద్రతా చర్యలపై వైస్-ఛాన్సలర్తో సమావేశం నిర్వహించింది.
Read Also: PM Modi: ఇది “తుక్డే తుక్డే గ్యాంగ్” భాష.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ ఏడుగురు విద్యార్థులు ఎక్కువ కాలంగా హాస్టల్ గదుల్లో ఉంటున్నట్లు వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా తెలిపారు. అందుకే వీరిని ఖాళీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ వ్యక్తులు చదువులను పూర్తి చేసి, కొన్ని పెండింగ్ అడ్మినిస్ట్రేషన్ పనుల కారణంగా హాస్టల్స్‌లో మాజీ విద్యార్థులుగా ఉంటున్నారని ఆమె చెప్పారు. ఇక వారు హాస్టల్‌లో ఉండాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ నిర్ధారించిందని, వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు.
వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అన్ని పేపర్ వర్క్స్ పూర్తి చేశామని, వారు ఇప్పుడు సురక్షితంగా స్వదేశానికి వెళ్లొచ్చని, సంబంధిత కాన్సులేట్లకు సమాచారం ఇచ్చామని ఆమె చెప్పారు. గుజరాత్ యూనివర్సిటీలో 300 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. రంజాన్ మాసంలో నమాజ్ హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నందున, యూనివర్సిటీ హాస్టల్‌లోకి కొంతమంది ప్రవేశించి విదేశీ విద్యార్థులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్రీలంక, తజకిస్తాన్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!