Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నగర వాసుల్ని ఎండలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. గత దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్‌కి పెరిగింది. 2016లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, ప్రస్తుతం రికార్డువుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కొద్ధి దూరంలోనే ఉన్నాయి.
Read Also: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ప్రస్తుతం బెంగళూర్ నగరంలో సగటున ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా కనీసం 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో బెంగళూర్ నగరంలో వర్షాలు తక్కువ కురిశాయి. చలికాలంలో బెంగళూర్‌లో వర్షం పడలేదు. ప్రధానంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రుతుపవనాల కాలంలో తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేగవంతమైన పట్టణీకరణ కూడా బెంగళూర్ ఇక్కట్లకు మరోకారణమని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో పనిచేస్తున్న డాక్టర్ పువియరాసన్ తెలిపారు.
బెంగళూర్ వాసులు ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తమ దినచర్యను మార్చుకుంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బెంగళూర్‌లో శనివారం రాత్రి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే, ఏప్రిల్ 14 తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!