PM Modi: ఇది “తుక్డే తుక్డే గ్యాంగ్” భాష.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీహార్‌లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అంతకుముందు మోడీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. రాజస్థాన్ ప్రజలకు ఆర్టికల్ 370తో సంబంధం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంతో ఇక్కడి ప్రజలకు ఎందుకు సంబంధం లేదని ఖర్గేని అడిగారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాజస్థాన్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. అది వినడానికి నేను సిగ్గుపడుతున్నాను. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదా..?’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ జాగ్రత్తగా వినాలి, బీహార్ నుంచి చాలా మంది యువకులు, ధైర్యవంతులు మాతృభూమి కోసం భారీ త్యాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ని రక్షించడానికి ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారు’’ అని ప్రధాని అన్నారు.
దేశంలో ఒక ప్రాంతంలో మరో ప్రాంతానికి సంబంధం ఏంటని అడుగుతున్నారని, ఇది తుక్డే తుక్డే గ్యాంగ్ భాష అని ప్రధాని దుయ్యబట్టారు. అలాంటి వారిని క్షమించాలా.? అని ప్రశ్నించారు. ఖర్గే చెప్పిన మాటలు వినడం సిగ్గు చేటని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. ఏప్రిల్ 19న జరిగే తొలి విడత ఎన్నికల్లో బీహార్ లోని నవడా, గయా, ఔరంగాబాద్, జముయి లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!