Sunroof: సన్‌రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో తెలిసే ఘటన చోటు చేసుకుంది. కొండపై నుంచి కారుపై రాయి పడి 43 ఏళ్ల స్నేహల్ గుజరాతీ అనే మహిళ మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది.
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరసగా భారతీయులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్, వలస విధానాలను కఠినతరం చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి H-1B వీసాలపై పడింది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడిన యువరాజులు’’ అని పిలిచారు. వీరిద్దరు ‘‘తప్పుదు హామీల దుకాణం’’ నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. Read Also: Rules change November 1: ఆధార్ అప్డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు.. నవంబర్ 1 […]
Chabahar Port: భారత్‌కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Regime-change operation: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు దారి తీసింది. ఈ అల్లర్ల కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, ఇతరుల బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ సిద్ధం చేశారు. ఈ హింసాకాండ ప్రణాళికాబద్ధంగా జరిగిందని, పాలనను మార్చేందుకు ‘‘రెజిమ్ ఛేంజ్ ఆపరేషన్’’లో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.
Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. అయితే, అప్పటి నుంచి హసీనా భారత్‌లో ప్రవాసంలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన తర్వాత, లక్షలాది మంది పార్టీ మద్దతుదారులు వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికల్ని బహిష్కరిస్తారని షేక్ హసీనా రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ప్రస్తుతం, ఢిల్లీలో స్వేచ్ఛగా నివసిస్తున్నానని, అవకాశం వస్తే నా దేశానికి తిరిగి వెళ్లాలని…
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే […]
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.