India - Afghanistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌తో ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. పాకిస్తాన్‌కు ఈ నదీ జలాలు అత్యంత కీలకం. ఆ దేశ వ్యవసాయం సింధూ దాని ఉప నదులపైనే ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ కూడా భారత దారిలోనే నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కునార్’’ నదిపై డ్యామ్ నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.
Pakistan: భారతదేశం పెద్ద ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహిస్తోంది. ‘‘త్రిశూల్ 2025’’ ఎక్సర్సైజ్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొంటున్నాయి.
DMK: డీఎంకే ప్రభుత్వం బీహార్ ప్రజల్ని వేధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన ఒక రోజు తర్వాత, డీఎంకే పార్టీ ప్రధానిపై విరుచుకుపడింది. డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతీ ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమిళనాడును అవమానించిందని, నిధుల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోడీవి విభజన రాజకీయాలని, బ్రిటీష్ పాలన కన్నా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. Read Also: JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షుడి […]
JD Vance - Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే.
Mallikarjun Kharge: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను దేశంలో నిషేధించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడాన్ని నిషేధించాలని అన్నారని ఖర్గే గుర్తు చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే శుక్రవారం అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చారు
H-1B visa: ట్రంప్ సర్కార్ భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. H-1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, భారతీయులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని పలు సందర్భాల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు.
Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి […]
Wedding Season: నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో రూ. 6.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని గురువారం ఒక నివేదిక తెలిపింది. 45 రోజుల వ్యవధిలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పింది. ఢిల్లీ 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు సమకూరుస్తుందని CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) అధ్యయనం తెలిపింది.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది.
Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించం ఇప్పుడు సంచలనంగా మారింది.