Bengal Gang Rape case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది.
Chernobyl: చెర్నోబిల్ అణు విపత్తును యావత్ ప్రపంచం మరిచిపోదు. సోవియట్ యూనియన్‌లోని అణు కర్మాగారం కుప్పకూలడంతో 1986లో చెర్నోబిల్ అణు విపత్తు ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఫోటోలు షాకింగ్‌కి గురిచేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న కుక్కలు నీలిరంగులోకి మారుతున్నాయి.
Bangladesh: షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆడింది ఆటగా సాగుతోంది. బంగ్లాదేశ్ తీవ్ర భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. భారత శత్రువులకు ‘‘రెడ్ కార్పెట్’’ ఆహ్వానం పలుకుతోంది. తాజాగా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ (LeT) హఫీజ్ సయీద్ సన్నిహితులు బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్ల్-ఎ-హదీత్ ప్రధాన కార్యదర్శి ఇబ్తిసం ఎలాహి జహీర్ అక్టోబర్ 25న ఢాకా చేరుకున్నారు. ఇతను…
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని చెప్పారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి.
Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
School Girls: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని నైన్పూర్లో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు విద్యార్థినులు నేరుగా మద్యం దుకాణానికి వచ్చి, మద్యం కొనగోలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైన్ షాప్ ముందు ఉన్న సీసీ టీవీలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో వచ్చి మందు కొంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
Viral Video: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నటేకూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బస్‌లో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
Saudi viral Video: పృథ్వీ రాజ్ నటించిన ‘‘గోట్ లైఫ్’’ సినిమా గుర్తుందా.?, ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన హీరో అక్కడి ఎడారిలో తన యజమాని చేతిలో చిక్కుకుపోయి, ఒంటలు కాస్తూ దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ, అక్కడ నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమిలు ప్రచారాలు మొదలుపెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి భావిస్తుంటే, దశాబ్ధానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడీ గెలుపు రుచి చూడాలని అనుకుంటోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6న ,నవంబర్ 11న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.