Dayanidhi Maran: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదానికి తీశాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తూ, కేవలం హిందీ మాత్రమే చదవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి విధానాల కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఇక, మీరు ఇంగ్లీష్ చదవొద్దని చెబుతున్నారు.. చదివితే నాశనం అవుతారని భయపెడుతున్నారు.. ఇలా చేస్తే మిమ్మల్ని బానిసలుగా మార్చినట్టే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం.. 3 రోజులు ఎన్‌ఐఏ కస్టడీకి డాక్టర్ షాహీనా
కాగా, తమిళనాడులో విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణమని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తమిళనాడుకు వస్తున్నాయంటే, అది ఇక్కడి విద్యావంతులైన యువత వల్లే అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో హిందీకి మాత్రమే పరిమితమైన విద్యా విధానం నిరుద్యోగాన్ని పెంచుతోందని ఆరోపించారు. దీనికి భిన్నంగా, తమిళనాడులో అమలవుతున్న ద్రావిడ మోడల్ బాలికలు- బాలురు అనే తేడా లేకుండా అందరికీ సమాన విద్య అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ విధానాలతో రాష్ట్రంలో అక్షరాస్యత రేటు పెరగడమే కాకుండా, మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని దయానిధి మారన్ వెల్లడించారు.
Read Also: IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
అయితే, ఇంగ్లీష్ మీడియం చదవకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది, భాషపై ఆంక్షలు విధించడం అభివృద్ధి, ఉపాధికి అడ్డంకిగా మారుతుందని దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దయానిధి మారన్‌కు “బుద్ధి లేదని” విమర్శిస్తూ.. హిందీ మాట్లాడే ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత తిరుపతి నారాయణన్ డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడేవారిని చదువులేని, సంస్కారం లేని వారిలా చిత్రీకరించడం దురదృష్టకరం అన్నారు.
Read Also: Google Pixel 10a లాంచ్ టైమ్‌లైన్ లీక్.. కలర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే!
ఇదిలా ఉంటే, దయానిధి మారన్ వ్యాఖ్యలకు డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ మద్దతుగా నిలిచారు. ఉత్తర భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడేవారు తక్కువగా ఉన్నారని తెలిపారు. ఇది రాష్ట్రాన్ని పాలించే పార్టీపై ఆధారపడి ఉంటుంది.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. తమిళనాడులో మేము మహిళల కోసం పోరాడి, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేశాం.. ప్రారంభం నుంచే మహిళా హక్కుల కోసం పని చేస్తున్నామని ఇళంగోవన్ చెప్పుకొచ్చారు. ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలతో హిందీ-ఇంగ్లీష్, ఉత్తరం- దక్షిణం మధ్య విద్య, ఉపాధి అంశాలపై రాజకీయ వివాదం మరింత తీవ్రంగా కొనసాగుతుంది.
#WATCH | Chennai, Tamil Nadu: On DMK MP Dayanidhi Maran's statement, DMK leader TKS Elangovan says, "It depends on the party which is ruling the state. Now Congress is empowering women. There is no doubt that wherever Congress is ruling, they are doing good for the education of… https://t.co/Bn2gSCmL8X pic.twitter.com/fg5nIZLZTS
— ANI (@ANI) January 13, 2026