ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్.. ఇప్పుడు అదొక ప్రెస్టిజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే అస్సలు నో చెప్పడం లేదు. శ్రియా సరన్ నుంచి మొదలు తమన్నా భాటియా, శృతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్‌లో స్టెప్స్ వేసి ఆడియన్స్‌కు కిక్ ఇచ్చారు. పూజా హెగ్డే, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో మొహమాటాలు అంటున్నారు భామలు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ చిన్నది ‘శాన్వి మేఘన’ చేరారు.
‘పిట్ట కథలు’లో రాములగా పరిచమైన శాన్వి మేఘన.. ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్‌కు స్టేజ్‌పై ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేశారు. బన్నీ ఫ్యాన్స్ చూపు తన వైపు తిప్పుకోగలిగింది కానీ.. ఆఫర్స్ మాత్రం కొల్లగొట్టలేకపోయారు ఈ కర్లీ హెయిర్ గర్ల్. కానీ తమిళంలో మాత్రం మేడమ్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ‘కుడుంబస్తాన్’తో హిట్ అందుకున్న ఈ హైదరాబాదీ అమ్మాయి.. సాయి అభ్యంకర్‌తో ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో నటించి మరింత పాపులరయ్యారు.
Also Read: IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో హీరోయిన్స్‌కు ఆఫర్స్ క్రియేట్ అవుతున్న వేళ శాన్వి మేఘన కూడా ఐటమ్ గర్ల్ అవతారమెత్తారు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు రిలీజైన ‘అనగనగా ఒకరాజు’లో ‘నాలోన సోకులున్నాయి.. సొంపులున్నాయి’ అంటూ పెప్పీ సాంగ్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఈ స్పెషల్ పాటకు ఆడిపాడారు. ప్రజెంట్ తమిళంలో ఓ ప్రాజెక్ట్ కమిటైన శాన్వి.. తెలుగులో మాత్రం స్టోరీలు వింటుందని టాక్. మరీ ఈ ఐటమ్ సాంగ్.. శాన్విని కూడా ఓన్ ఇండస్ట్రీలో బిజీ చేస్తుందేమో చూడాలి.