Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
Read Also: Amit Shah: “ఆ పోస్టులు ఖాళీగా లేవు”.. కాంగ్రెస్, ఆర్జేడీపై అమిత్ షా కామెంట్స్..
బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే, పెళ్లి తర్వాత మొదటి ఏడాది అంతా బాగానే గడిచింది. ఆ తర్వాత నుంచి భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్త ఇంటికి దూరంగా ఉండటంతో పాటు, ఇంటికి వచ్చినప్పుడు తీజాను భర్త ముకేష్ తీవ్రంగా కొట్టే వాడు. సోమవారం ఇంటికి వచ్చిన ముకేష్, తన భార్య కొట్టి, లైంగిక దాడి చేశాడు. మంగళవారం కూడా తీవ్రంగా దాడి చేసి, సెక్స్ చేయడానికి బలవంతంగా ప్రయత్నించాడు. తేజా నిరాకరించిందనే కోపంతో ముకేష్, అతడి తల్లిదండ్రులు ఆమెను ఇంటి పై భాగం నుంచి తోసేశారు.
తీజా అరుపులు విన్న స్థానికులు, నేలపై పడి ఉండటాన్ని చూసి, ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.