Israel-Pakistan: ఇజ్రాయిల్‌తో పాకిస్తాన్ స్నేహం.. నమ్మడం కష్టమైనా ఇదే నిజం..
- ఇజ్రాయిల్‌తో స్నేహం కోసం పాక్ ఆరాటం..
- 20,000 మంది పాక్ సైనికులు గాజాకు..
- హమాస్‌ను అంతమొందించేందుకు సాయం..
- సీఐఏ, మోసాద్‌తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్మీకి చెందిన 20,000 మంది సైనికుల్ని గాజాకు పంపుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ISF)లో భాగంగా వీరంతా గాజాకు వెళ్లనున్నారు. ఈ దళం ప్రధాన ఉద్దేశం గాజాలో హమాస్‌ను పూర్తిగా తుడిచేయడం, అక్కడ ఉన్న ఆయుధాలు లేకుండా చేయడం. అంటే ఈ చర్యల ఇజ్రాయిల్ అనుకూలంగా ఉంటుంది. ఇజ్రాయిల్ మొసాద్, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) సీనియర్ అధికారులు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రహస్యంగా సమావేశమైన తర్వాత, సైనికుల్ని పంపాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
Read Also: Female Terrorists: మసూద్ అజార్ భారీ కుట్ర.. పాకిస్థాన్ కేంద్రంగా మహిళా ఉగ్రవాదులకు శిక్షణ..
నిజానికి ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌ను పాకిస్తాన్ గుర్తించలేదు. పాకిస్తాన్ తన దౌత్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించాలని అనుకుంటోంది. గాజాలో తమ పాత్రలో పాటు, పశ్చిమ ఆసియా అభివృద్ధి చెందుతున్న భద్రతా నిర్మాణంలో తనను తాను మరింతగా స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ ఇజ్రాయిల్ భద్రతా కార్యకలాపాల్లో భాగం కావడం ఇదే తొలిసారి. గాజాకు పాక్ దళాలు వెళ్లే చర్చలు జరుగుతున్నాయని పాక్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ హమాస్‌ను పూర్తిగా తుడిచివేయడంతో పాటు, బఫర్ జోన్‌ను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గాజాలో పాకిస్తాన్ సైనికులు అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ISF)లో భాగంగా ఉంటారు, ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రిప్ కోసం 20-పాయింట్ల ప్రణాళిక ప్రకారం పాలస్తీనా ఎన్క్లేవ్‌ను పాలస్తీనా అథారిటీ (PA)కి చివరికి అప్పగించే వరకు భద్రతను అందించడానికి ఈ దళం సహకరిస్తుంది. గాజాలో హమాస్ నిరాయుధీకరణకు ఈ దళం పోరాడుతుంది. పాక్ దళాలతో పాటు ఇండోనేషియా, అజర్ బైజాన్ దళాలతో ఈ ఐఎస్ఎఫ్‌లో భాగం కానున్నాయి. దీనికి బదులుగా పాకిస్తాన్ కు అంతర్జాతీయ రుణ సహాయం అందించే ప్యాకేజీలకు ఇజ్రాయిల్, అమెరికా మద్దతు ఉంటుంది. అయితే, గాజాలో పాకిస్తాన్ ఉనికిని ఇరాన్, టర్కీ, ఖతార్ వ్యతిరేకిస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!