Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్‌లైన్స్ పోస్ట్..
Pakistan: యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది. -
Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. -
Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
Ram Mandir: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరి ఏడాది గడిచింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
Devendra Fadnavis: “రాజ్ ఠాక్రే స్నేహితుడు, ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు”.. ఫడ్నవీస్ కామెంట్స్..
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు. -
Live-In Partner: లివ్-ఇన్‌లో ఉన్న మహిళని చంపేసిన వ్యక్తి.. 8 నెలలుగా ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు. -
Ghaziabad: కస్టమర్లకు అందించే రోటీలపై ఉమ్మి వేసిన వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్..
Ghaziabad: కస్టమర్లకు ఇచ్చే రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోటీలు తయారు చేసే సమయంలో ఓ వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. లోధి చౌక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక తినుబండారాల షాపులో పనిచేస్తున్న 20 ఏళ్ల ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
Couple Suicide: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య.. ఆ తర్వాత భార్య కూడా..
Couple Suicide: కుటుంబ తగాదాలు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణయ్యాయి. ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతుల ఏడాది వయసు ఉన్న పాప ప్రస్తుతం అనాథగా మారింది. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో జరిగింది. విజయ్ ప్రతాప్ చౌహాన్ (32) , అతని భార్య శివాని (28) మధ్య గొడవ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
Donald Trump: ట్రంప్‌తో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సమావేశం..
Donald Trump: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ మీటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు మెటా కానీ, అటు ట్రంప్ వర్గం కాని స్పందించలేదు. -
Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
Big Scam: ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Jagjit Singh Dallewal: ‘‘అకల్ తఖ్త్‌ని కాదు, మోడీని కలవండి’’.. అప్పుడే నిరాహార దీక్ష విరమిస్తా..
Jagjit Singh Dallewal: రైతు నాయకుడు జగ్లీత్ దల్లెవాల్ నిరాహార దీక్ష విరమించాలని పంజాబ్ బీజేపీ అకల్ తఖ్త్కి విజ్ఞప్తి చేసింది. పంటలకు చట్టబద్ధమైన ఎంఎంస్పీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 46వ రోజుకు చేరుకుంది. అయితే, తాను నిరాహార దీక్ష విరమించాలనుకుంటే బీజేపీ నేతలు అకల్ తఖ్త్‌ని కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని శుక్రవారం కోరారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!