Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్‌కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..
- గోవాలోని ఆ బీచ్‌కి వెళ్లాంటే హోటల్ రిజర్వేషన్ తప్పనిసరి..
- నిబంధనలు ఉల్లంఘించే పర్యాటకులపై పన్ను..
- ఇష్టారీతిగా ప్రవర్తిస్తుండటంతో పంచాయతీ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa: బ్యాచిలర్లకు, కపుల్స్, ఫ్యామిలీ ఇలా ఎవరికైనా డ్రీమ్ డెస్టినేషన్లలో గోవా తప్పకుండా ఉంటుంది. బీచులు, మందు, విందు, నైట్ లైఫ్ ఇలా ప్రతీది ఆస్వాదించవచ్చు. అయితే, ఇప్పుడు మాత్రం మందు తాగుతూ, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తామంటే కదరదు. గోవాలోని ఫేమస్ బీచుల్లో ఒకటైన ‘కలంగుట్’ బీచ్‌కి వచ్చే వారు తప్పకుండా హోటల్ రిజర్వేషన్లను చూపించాలని అక్కడి స్థానిక గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు విచ్చలవిడిగా ప్రవర్తించడం, గ్రామానికి చెడ్డపేరు తెచ్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పర్యాటకులు తమ గ్రామ పరిధిలోకి ప్రవేశించే ముందు హోటల్ రిజర్వేషన్లను తప్పనిసరిగా చూపించాలని తీర్మానం చేసింది. గ్రామ పరిసరాల్లో చెత్తను విసిరేసేవారిపై పన్ను విధించాలని నిర్ణయించింది. ‘‘పర్యాటకులు జీపులు, బస్సులతో గుంపులుగా వస్తారు. బీచ్ ప్రాంతంలో మద్యం సేవిస్తారు. అక్కడే వంట చేసుకుని చెత్తను విసిరేస్తు్న్నారు. ఇప్పుడు హోటల్ రిజర్వేషన్ వెరిఫికేషన్ కోసం చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇష్టారీతిగా ప్రవర్తించే వారిపై పన్ను, ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించుకున్నాము’’ అని గ్రామ సర్పంచ్ జోసెఫ్ సిక్వెరా తెలిపారు.
గతంలో మహాబలేశ్వర్‌లో కూడా ఇలాంటి తీర్మానాన్ని తీసుకువచ్చినట్లు కలంగుట్ పంచాయతీ గుర్తు చేసింది. కలంగుట్ బీచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పంచాయతీ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని తీర్మానం పేర్కొంది. పర్యాటకులు బీచ్‌ని పబ్లిక్ టాయిలెట్‌గా ఉపయోగిస్తున్నారని, ఇస్టారీతిలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, మద్యం తాగి సీపాలు, చెత్తను విసిరేసి వెళ్తున్నట్లు పంచాయతీ పేర్కొంది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!