Automatic Cars: దేశంలో క్రమక్రమంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే కార్‌లను కలిగి ఉంటారనే ధోరణి నుంచి ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు కూడా తమకు సొంతగా ఓ కారు ఉండాలనే కలను కంటున్నాయి. దీంతో దేశీయ, విదేశీ ఆటోమేకర్స్ వీరిని దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్లను సరసమైన ధరల్లో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో తక్కువ ధరలతో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన కార్‌లలో టాప్-5గా టాటా టియాగో, మారుతి సెలెరియో, రెనాల్ట్ క్విడ్, మారుతి ఎస్ ప్రెస్సో, మారుతి సుజుకి ఆల్టో K10 ఉన్నాయి. ఇవి మాన్యువల్‌తో పాటు సరసమైన ధరలోనే ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్:
క్విడ్ AMT లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ధర రూ. 5.45 లక్షలు నుంచి రూ. 6.45 లక్షలు(ఎక్స్-షోరూం) కలిగి ఉంది. ఇది 67 హెచ్‌పీ పవర్, 91 ఎన్ఎం టార్క్ కలిగి ఉంది. 1.0 లీటర్, 3-సిలిండర్ యూనిట్ కలిగి ఉంటుంది. దీని మైలెజ్ 22.3 kmpl అని కంపెనీ క్లెయిమ్ చేసింది.
మారుతి సుజుకీ ఆల్టో కే 10:
క్విడ్‌తో పోలిస్తే ఆల్టో కే 10 మరింత తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 5.56 లక్షల నుంచి రూ. 5.85 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. 66 హెచ్‌పీ, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ కలిగి 24.91కి.మీ మైలేజ్ ఇస్తుంది.
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో:
దీని ధర రూ. 5.71 లక్షల నుంచి రూ. 6 లక్షల (ఎక్స్ షోరూం)గా ఉంది. ఇది 1.0 లీటర్ ఇంజన్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. దీని మైలేజ్ 25.3 kmplగా ఉంది.
మారుతీ సుజుకీ సెలెరియో:
దీని ధర రూ. 6.33 లక్షల నుంచి రూ. 7.09 లక్షల వరకు ఉంది. ఇది కూడా 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. దీని మైలేజ్ 26.6 kmplగా ఉంది.
టాటా టియాగో:
దేశీ ఆటోమేకర్ టాటా నుంచి వచ్చి హ్యాచ్ బ్యాక్ టియాగో కార్ సేఫ్టీతో పాటు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ రెవెట్రోన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 72 హెచ్‌పీ, 95 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ ఏఎంటీ యూనిట్ కలిగి ఉంది. 19 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ కారు సీఎన్‌జీ వెర్షన్‌లో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. దీని మైలేజ్ 28.60 km/kgగా ఉంది. పెట్రోల్ వెర్షన్ దర రూ. 6.95 లక్షల నుంచి రూ. 7.95 లక్షలు( ఎక్స్-షోరూం)గా ఉంది. ఇక సీఎన్‌జీ ధర రూ. 7.9 లక్షల నుంచి రూ.8.9 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.