CSIR-UGC-NET: వరసగా పేపర్ లీకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నీట్, యూజీసీ-నెట్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ఈ లీకులన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27 మధ్య జరగాల్సిన CSIR-UGC-NET పరీక్షను అనివార్య పరిస్థితులతో పాటు లాజిస్టిక్ సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ శుక్రవారం తెలిపింది. జాయింట్ CSIR యూజీసీ నెట్ అనేది భారతీయ యూనివర్సిటీలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) మరియు లెక్చర్‌షిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే పరీక్ష. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటుంది.
Read Also: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
వరస పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈనెల 18న జరిగిన యూజీసీ-నెట్ పరీక్షను తర్వాతి రోజు అంటే బుధవారం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ రద్దు చేసింది. డార్క్‌వెబ్‌లో ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేంద్రం తెలిపింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ లీకులు వెనక ఉన్నవారిని విడిచిపెట్టేలేది లేదని, విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్మాణం, పనితీరు, పారదర్శకత కోసం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
NTA postponed the Joint CSIR-UGC-NET Examination June 2024 which was scheduled to be held between June 25 to 27. It is being postponed due to unavoidable circumstances as well as logistic issues. The revised schedule for the conduct of this examination will be announced later… pic.twitter.com/cJknD7OHBb
— ANI (@ANI) June 21, 2024