UAE: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఇస్లామిక్ దేశం.. రేప్, అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి చట్టం..
- చారిత్రాత్మక సంస్కరణ దిశగా యూఏఈ..
- రేప్ - అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి ఓకే..
- ఇస్లామిక్ దేశంలో ఇది అతిపెద్ద నిర్ణయం..
- 120 రోజుల లోపు గర్భానికి మాత్రమే అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చారిత్రాత్మక సంస్కరణకు ముందడుగు వేసింది. అత్యాచారం, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్‌కి అనుమతించింది. ఒక ఇస్లామిక్ దేశంలో ఇది అతిపెద్ద నిర్ణయంగా పరిగణించబడుతోంది.ఆ దేశ వైద్య చట్టంలోని 2024 కేబినెట్ రిజల్యూషన్ నెంబర్ 44 ప్రకారం.. ‘‘ గర్భధారణ అనేది ఒక స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె సమ్మతి లేకుండా సంభోగం కలిగి ఉంటే లేదా మహిళ గర్భం దాల్చడానికి కారణమైన వారు సదరు మహిళ పూర్వీకులు లేదా ఆమె మహర్మ్(వివాహానికి అనర్హులైన) బంధువుల్లో ఒకరిగా ఉంటే’’ అబార్షన్లకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని UAE ప్రభుత్వ యాజమాన్యంలోని ఆంగ్ల భాషా దినపత్రిక అయిన ది నేషనల్ నివేదించింది.
Read Also: Royal Enfield: అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
అత్యచారం, వివాహేతర సంబంధం వల్ల గుర్భం దాల్చిన మహిళ, గర్భవిచ్ఛత్తికి కొత్త చట్టం అనుమతిస్తుంది. అత్యాచారం లేదా అక్రమ సంబంధం విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి తీసుకురావాలని తీర్మానం పేర్కొంది. మహిళల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తుంది. ఇదిలా ఉంటే యూఏఈలో కనీసం ఏడాది ఉన్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
యూఏఈ చట్టాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. అయితే, మహిళలకు ఈ నేరాల వల్ల ఎదురయ్యే గర్భధారణన సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు కావాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి యూఏఈ చట్టం ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఒక వేళ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే, దివ్యాంగురాలు అయితే మరణశిక్ష విధిస్తారు. ప్రస్తుతం యూఏఈ ప్రవేశపెట్టిన తీర్మానం అధికార గెజిట్‌లో ప్రకటించిన తర్వాత అమలులోకి వస్తుంది. మహిళల హక్కులను ప్రాధాన్యత ఇస్తూ, ఛాందసవాద చట్టాలను మార్చే పనిలో యూఏఈ ఉంది. కొత్త చట్టం మహిళల ఆరోగ్యం, సమానత్వానికి ప్రతీకగా నిలువబోతోంది.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!