Paris: 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి ముందు ఆస్ట్రేలియాకు చెందిన మహిళపై పారిస్‌లో గ్యాంగ్ రేప్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో లాలూకి చెందిన ఆర్జేడీ పార్టీ మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ సభలో నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యే రేఖాదేవిపై సీఎం ఫైరయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ..‘‘ మీరు మహిళ, మీకు ఏమీ తెలియదు. సైలెంట్‌గా వినండి’’ అని సభలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే.
J&K Terror Attacks: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Table-Top Runways: నేపాల్‌లో ఈ రోజు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలోని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలైన పైలెట్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్ట రన్ వేలు కలిగిన విమానాశ్రయాలు నేపాల్‌లో ఉన్నాయి. ఈ రన్ వేల కారణంగా ఇప్పటికే పలుమార్లు నేపాల్‌లో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విమాన ప్రమాదాలకు ‘టేబుల్ టాప్ రన్ వేస్’’ కారణమవుతున్నాయి.
Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు.
Rahul Gandhi: మరోసారి తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతుల సంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ రోజు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో రైతుల నేతలు భేటీ అయ్యారు.
MK Stalin: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు తమిళనాడుని కేంద్ర బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.