Paris: ఆస్ట్రేలియా మహిళపై గ్యాంగ్ రేప్.. ఒలింపిక్స్‌కి ముందు ఘటన..
- ఆస్త్రేలియన్ మహిళపై గ్యాంగ్ రేప్..
- ఒలింపిక్స్ గేమ్స్ ముందు ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris: 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి ముందు ఆస్ట్రేలియాకు చెందిన మహిళపై పారిస్‌లో గ్యాంగ్ రేప్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 25 ఏళ్ల మహిళ దిక్కుతోచని స్థితిలో శనివారం పారిస్‌లోని పిగాల్లే పరిసరాల్లోని ఓ స్థానిక రెస్టారెంట్‌లోకి ప్రవేశించింది. ఆమె దుస్తులు పాక్షికంగా చిరిగిపోయి ఉన్నాయి. శుక్రవారం-శనివారం ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పారిస్ అధికారులు ధృవీకరించారు. ఆమె స్థితిని చూసిన రెస్టారెంట్ యాజమాన్యం సాయం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం బిచాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Read Also: Nitish Kumar: ‘‘ మీరు మహిళ, మీకు ఏం తెలియదు’’.. ఆర్జేడీ ఎమ్మెల్యేపై సీఎం ఫైర్..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
భద్రతా అధికారులు పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రవాద దాడులు, సైబర్ అటాక్స్ వంటి వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ఇబ్బందికరంగా మారింది. ఆస్ట్రేలియా ఒలింపిక్ జట్టు పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ చీఫ్ స్ట్రాత్ గోర్డాన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ అథ్లెట్లు ఈ దాడి గురించి తెలిపినట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న సమయంలో టీమ్ కిట్ ధరించవద్దని వారికి సూచించారు.
బాధితురాలికి ఆస్త్రేలియన్ దౌత్య అధికారులు, ఫ్రెంచ్ పోలీసులు సాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ అథ్లెట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నా మీరెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ అథ్లెట్లకు భద్రతా ఉందని, వారు సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వారు ఒలింపిక్ విలేజ్ నుంచి సొంతగా బయటకు వెళ్లొద్దని, జట్టు యూనిఫాం ధరించొద్దని, సాధారణ దుస్తులు ధరించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పారిస్‌లోని ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ప్రెంచ్ అధికారులతో అత్యవసర విచారణ చేస్తోంది. జూన్ నెలలో పారిస్ శివారులో 12 ఏళ్ల యూదు బాలికపై అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..