Bhopal: భోపాల్‌లో జరిగిన ఓ విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. చినార్ డ్రీమ్ సిటీ అనే అపార్ట్‌మెంట్‌లో ప్రీతమ్ గిరి (77) అనే వృద్ధుడు లిఫ్ట్ షాఫ్ట్‌లో మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన కనిపించకుండా పోయి దాదాపు 10 రోజులు గడిచిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ దగ్గర నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు గమనించారు. వెంటనే మెయింటెనెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ కారును పైకి ఎత్తగా, కింద షాఫ్ట్‌లో ఒక శరీరం కనిపించింది. అప్పటికే అది బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుస్తులు, చెప్పుల ఆధారంగా కుటుంబ సభ్యులు అది ప్రీతమ్ గిరిదేనని గుర్తించారు. కుటుంబ “మండీదీప్‌కు వెళ్తున్నాను” అని కుటుంబానికి చెప్పారట. కానీ ఆయన తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి ఆయన కుమారుడు మనోజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరుసటి రోజు మిస్రోడ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
READ MORE: Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘దండోరా’
మిస్రోడ్ ఏసీపీ రాజనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. అసహజ మృతి కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రాథమికంగా లిఫ్ట్ షాఫ్ట్‌లో పడిపోవడం వల్ల ఛాతీకి గాయాలై మృతి చెందినట్టు అనుమానం ఉందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పుడు లిఫ్ట్ ఆపరేటర్, అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ టీమ్‌కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. “లిఫ్ట్ ఎప్పటి నుంచి పనిచేయడం లేదు? ఎలాంటి మరమ్మతులు చేశారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది?” అనే అంశాలపై విచారణ చేస్తామని చెప్పారు. నిర్లక్ష్యం నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
READ MORE: Akshay Kumar: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..?
అయితే మృతుడి కుమారుడు మనోజ్ గిరి పోలీసుల పనితీరుపై, అలాగే అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జనవరి 6న లిఫ్ట్ పనిచేయడం లేదని, గ్రౌండ్ ఫ్లోర్ కంటే రెండు అడుగులు కింద ఆగిపోయి ఉందని చెప్పారు. అందుకే తన తండ్రి లిఫ్ట్ వాడాలేదని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి రాకుండా, మూడు రోజుల తర్వాత స్టేషన్‌లోనే తన తమ్ముడి స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. అలాగే అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏళ్లుగా పనిచేయడం లేదన్నారు. లిఫ్ట్ పరిస్థితి బాగోలేదని నివాసితులు ఎన్నిసార్లు చెప్పినా, మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు వాయిదా వేస్తూ వచ్చిందని ఆరోపించారు.