Rahul Gandhi: మరోసారి తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతుల సంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ రోజు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో రైతుల నేతలు భేటీ అయ్యారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. వీరితో పాటు ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, సుఖ్‌జిందర్ సింగ్ రంధావాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే, రైతుల్ని లోపలికి అనుమతించే విషయంలో గందరగోళం నెలకొంది. వారిని మేము ఆహ్వానించామని, కానీ వారిని పార్లమెంట్ లోపలికి అనుమతించలేదని, వారు రైతులు కావడం వల్లే లోపలికి అనుమతించడలేదు కావచ్చు, దీనికి కారణాన్ని ప్రధానినే అడగాలి అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రైతుల సమస్యల్ని లేవనెత్తుతారని అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చెప్పారు. ఢిల్లీకి వచ్చి రైతులు నిరసన తెలిపేందుకు అన్ని హక్కుల ఉన్నాయని, అవసరమైతే పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు కూడా పెడగామని ఆయన అన్నారు.
రైతు సంఘాల నేతల్లో ఒకరైన జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి పాదయాత్రగా వస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మల్ని తగలబెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాయి.
कुछ किसान मुझसे मिलना चाहते थे, इसलिए मैंने उन्हें अंदर ऑफिस में बुलाया था।
लेकिन उन्हें अंदर आने नहीं दिया गया, इसका कारण आपको प्रधानमंत्री से पूछना पड़ेगा।
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 संसद परिसर, नई दिल्ली pic.twitter.com/jbidAjAFqV
— Congress (@INCIndia) July 24, 2024