Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీపై బీజేపీ నేత కేసు.. సమన్లు జారీ..
- యూట్యూబర్ ధృవ్ రాఠీపై పరువనష్టం కేసు..
- కేసు ఫైల్ చేసిన బీజేపీ నేత..
- సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వీడియోలో ఎలాంటి కారణాలు లేకుండా తనను ‘‘హింసాత్మక’’ వ్యక్తిగా ఆరోపణలు చేశాడని బీజేపీ నేత ఆరోపించారు. జులై 7న తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన “‘‘మై రిప్లై టూ గోడి యూట్యూబర్స్ ఎల్విష్ యాదవ్ ” అనే శీర్షికతో రాఠీ చేసిన వీడియోలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన కేసు నమోదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా నఖువా రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కేసులో సాకేత్ కోర్టులోని జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న ధ్రువ్ రాతీకి సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రెచ్చగొట్టే విధంగా రాథీ, నఖువాకు వ్యతిరేకంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ పేర్కొంది. యూట్యూబర్ తన ప్రతిష్టను దెబ్బతీసే ధోరణిని కలిగి ఉన్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీ తన అధికారిక నివాసంలో ‘‘అంకిత్ జైన్, సురేష్ నఖువా, తజిందర్ బగ్గా వంటి హింసాత్మక మరియు దుర్వినియోగ ట్రోలర్లతో సమావేశయ్యారని రాఠీ నకిలీ ఆరోపణలు చేశారని నఖువా ఆరోపించారు. ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్ దక్కించుకుందని, 2.3 మిలియన్స్ లైక్స్ వచ్చాయని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని పిటిషన్ పేర్కొంది. యూట్యూబ్ లేదా ఎక్స్‌లో ధృవ్ రాఠీ ఏదైనా కంటెంట్ ట్వీట్ చేయడం, పోస్ట్ చేయడాన్ని నిరోధించాలని పిటిషన్‌లో కోరారు. నఖువా చేసిన అభ్యర్థనపై ధృవ్ రాఠీకి కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆగస్టు 6న తదుపరి విచారణ జరగనుంది.
మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కుమార్తెకు వ్యతిరేకంగా ఎక్స్‌లో నకిలీ వార్తలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ధృవ్ రాఠీకి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ పరువునష్టం కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఎస్‌సీ పరీక్షలు రాయకుండానే అంజలి బిర్లా ఉత్తీర్ణత సాధించారని ధృవ్ రాఠీ పేరుతో ఉన్న పేరడీ అకౌంట్లో ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!