Venu Goapl Reddy
Author- NTV Telugu-
High Court: శారీరక సంబంధం లేకుండా భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు..
High Court: భర్త కాకుండా, వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని జస్టిస్ అహ్లువాలియా తీర్పు చెప్పారు. కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ, ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
Annamalai: ‘‘బడ్జెట్ గురించి ముందు తెలుసుకోండి’’.. యాక్టర్ విజయ్‌పై అన్నామలై సెటైర్స్..
Annamalai: కేంద్ర బడ్జెట్‌పై నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ చేసిన విమర్శలకు, తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక విధానాలు ఎలా రూపొందించబడతాయనే ప్రాథమిక అవగాహన ఆయనకు లేదని ఆరోపించారు. విజయ్ బడ్జెట్‌ని ఉద్దేశించి విమర్శి్స్తూ.. తమిళనాడుని బడ్జెట్లో పట్టించుకోలేదని, జీఎస్టీ తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఆరోపించారు. -
Indians deported: రెండో విడత భారతీయుల బహిష్కరణ.. శనివారం యూఎస్ నుంచి విమానం..
India US: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్‌సర్‌కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్సర్ వస్తున్నట్లు తెలుస్తోంది. -
CM Yogi Adityanath: ఎంతకు తెగించార్రా.. యోగికే “టోపీ” పెడతారా..
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించిన డీఫ్ ఫేక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. యోగి ముస్లింలు ధరించే టోపీని ధరించినట్లు కొందరు నఖిలీ వీడియోను సృష్టించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహిత(BNS), IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు..
Manipur: గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణ కారణంగా ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్తగా ఎవరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. దీంతో కేంద్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
AAP: బీజేపీ చేతిలో ఓటమికి కారణాలు ఇవే.. ఆప్‌లో అంతర్మథనం..
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఆప్ ఘోర పరాజయం పొందింది. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాషాయ పార్టీ 48 సీట్లు గెలిస్తే, ఆప్ 22కే పరిమితమైంది. కాంగ్రెస్ అత్యంత దారుణంగా సున్నా స్థానాలకు పరిమితమై, 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆప్ తన ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ప్రధానంగా తమ ఓటమికి 3 కారణాలను ఆప్ నేతలు ప్రస్తావిస్తు్న్నారు. -
Donald Trump: ‘‘ టుడే ఈజ్ ద బిగ్ వన్’’.. సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
PM Modi: ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్న ప్రధాని మోడీ..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి. -
PM Modi US Visit: ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చకు రానున్న అంశాలు ఇవే..
PM Modi US Visit: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీపై భారత్‌తో పాటు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ప్రధాని మోడీని అమెరికా సందర్శించమని ఆహ్వానించడం భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను చూపిస్తుంది.’’ అని అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్ […] -
JP Morgan Chase: లే ఆఫ్స్‌కి సిద్ధమైన JP మోర్గాన్ చేజ్..
JP Morgan Chase: టెక్ సంస్థల్లో అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇలా ఉద్యోగుల ఉద్వాసనకు కారణమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ దిగ్గజాలతో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా, అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ JP మోర్గాన్ చేజ్ భారీగా ఉద్యోగుల లేఆఫ్స్‌కి ప్లాన్ సిద్ధం చేసింది. 2025 అంతా ఉద్యోగుల కోతలు ఉంటాయని ప్రకటించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!