Wolf Attacks: ఉత్తర ప్రదేశ్‌ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతున్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్‌గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.
Haryana: హర్యానాలో దారుణం జరిగింది. గోవుల స్మగ్లర్లుగా భావించి, గో సంరక్షకులు కారును వెంబడించి హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ దాడిలో నిందితులను నిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్ మరియు సౌరభ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Boeing Starliner: బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు నాసాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్టార్‌లైనర్‌లో జూన్ 5న 8 రోజుల అంతరిక్ష ప్రయోగంలో భాగంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లారు. అయితే, స్టార్ లైనర్ క్యాప్సూల్ అంతరిక్షానికి చేరగానే వరసగా దాంట్లో అంతరాయాలు మొదలయ్యాయి.
PM Modi To Visit Brunei: ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్‌లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్‌తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన ‘‘జమాతే ఇస్లామీ’’ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ క్లీన్చిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన హెఫాజత్-ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్, అతడి గ్రూపు సభ్యులతో కలిసి మహ్మద్ యూనస్ భేటీ కావడం వివాదాస్పదమైంది.
Canada: కెనడాలో వాంకోవర్‌లో పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కలకలం రేపింది. కెనడాలోని విక్టోరియా ద్వీపంలోని ధిల్లాన్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత అతను స్పందించాడు.
Abhishek Banerjee: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్‌లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: హర్యానా ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల మొదటివారంలో ఈ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, వరసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి.
Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) అరెస్ట్ వారెంట్‌ని ధిక్కరించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీసీ గతేడాది పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యదేశాల పర్యటనకు వెళ్తే పుతిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.