Canada: కెనడాలో వాంకోవర్‌లో పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కలకలం రేపింది. కెనడాలోని విక్టోరియా ద్వీపంలోని ధిల్లాన్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత అతను స్పందించాడు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ ఘటనకు బాధ్యత వహించినట్లు సమాచారం. ‘‘నేను క్షేమంగా ఉన్నాను. నన్ను సంప్రదించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతే నాకు అంతా’’ అని ధిల్లాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
Read Also: Abhishek Banerjee: దయచేసి చెడుగా మాట్లాడొద్దు.. టీఎంసీ నేతల్ని కోరిన మమతా మేనల్లుడు..
కెనడాలోని విక్టోరియా ద్వీపం మరియు వుడ్‌బ్రిడ్జ్ టొరంటో అనే రెండు ప్రదేశాలలో కాల్పులు జరిగినట్లు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదార ఓ పోస్టులో పేర్కొన్నారు. ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో ధిల్లాన్ సల్మాన్ ఖాన్ ఫోటోని ప్రదర్శించడంతోనే ఫైరింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న వ్యక్తి, తాను సింగర్‌ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది నవంబర్‌లో కెనడా సింగర్ గిప్పీ గ్రెవాల్ ఇంటిపై జరిగిన కాల్పులకు కూడా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించాడు. వాంకోవర్‌లోని వైట్ రాక్ పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో , ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ముంబై పోలీసులు ఈ ఘటనకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ల పనే అని తెలిపారు.