Central Cabinet Decisions: ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ.13,966 కోట్లను కేంద్రం కేటాయించింది. రూ. 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రైతులు లోన్ తీసుకోవడం వచ్చే రోజుల్లో కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి కానుంది.
RSS: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘కుల గణన’ అంశం ప్రముఖంగా నిలిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కులగణనకు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
IC 814 - The Kandahar Hijack: 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించబడిన 'IC 814: ది కాందహార్ హైజాక్' నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌పై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో ఐదుగురు హైజాకర్ల పేర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు హిందూ పేర్లయిన భోలా, శంకర్ అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అని ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
Congress: కేరళ చిత్ర పరిశ్రమ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటీ నివేదిక సంచలనాన్ని సృష్టించింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టు సంచలనంగా మారిన తరుణంలోనే కేరళ కాంగ్రెస్‌లో కూడా ఫిలిం ఇండస్ట్రీ తరహాలోనే ‘‘కాస్టింగ్ కౌచ్’’ ఉందని ఆ పార్టీకి చెందిన మహిళా నేత రోజ్బెన్ జాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆమె ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ ఆమెను తొలగించింది.
Emergency: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ‘‘ఎమర్జెన్సీ’’ వివాదాస్పదమవుతోంది. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పాలనలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం సినిమాని వ్యతిరేకించడంతో వివాదం నెలకొంది.
JP Nadda: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలను హేమా కమిటీ వెలుగులోకి తీసుకువచ్చింది. పలువురు స్టార్ యాక్టర్స్ మహిళా టెక్నీషియన్స్, నటీమణులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి తోడు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న కొన్ని వేధింపుల గురించి చెప్పడం సంచలనంగా మారింది.
Eknath Shinde: సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది.
IC 814 Hijack: చిత్ర నిర్మాత అనుభవ్ సిన్హా తాజా వెబ్ సిరీస్ 'IC 814: ది కాందహార్ హైజాక్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదుల హైజాక్ చేసిన ఉదంతం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు.
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు.