France: సొంత భార్యకి మత్తు మందు ఇచ్చి ఏకంగా 10 ఏళ్ల పాటు అత్యాచారం చేయించాడో భర్త. 50 మంది వరకు పురుషులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా తనకు జరిగిన ఘోరమైన ఘటన గురించి ఆమె కోర్టులో చెప్పింది. దక్షిణ ఫ్రాన్స్ నగరమైన అవిగ్నాన్‌లోని గిసెల్ పెలికాట్(72) మత్తులో ఉన్న సమయంలో ఆమె భర్త డోమినిక్ పెలికాట్(71) తనపై అత్యాచారం చేయడానికి చాలా మంది పురుషుల్ని ఆహ్వానించినట్లు వివరించింది.
Wolf attacks: ఉత్తర్ ప్రదేశ్ వరస తోడేళ్ల దాడులతో భయాందోళనకు గురవుతోంది. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మనుషులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నాయి. వీటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. వందలాది మంది అధికారుల్ని, బలగాలను మోహరించారు. మొత్తం ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ప్రస్తుతానికి నాలుగింటిని పట్టుకున్నా, మిగతా రెండు మాత్రం వాటి దాడుల్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.
IC 814 Hijack: నెట్ఫ్లిక్ వెబ్ సిరీస్ ‘‘ IC 814 - కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. ఉగ్రవాదుల పేర్లకు బదులుగా హిందూ కోడ్ నేమ్స్ వాడటంతో దీనిపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ, ఆనాటి ఘటనను మరోసారి ఈ సిరీస్ భారతీయులకు గుర్తు చేసింది. 1
ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చొక్కా లేకుండా ట్రక్కు ముందు కూర్చొని ఏడుస్తున్న ఫోటో వెలుగులోకి వచ్చింది. మరో దాంట్లో స్పృహ లేకుండా పడి ఉన్న ఫోటో కనిపించింది. అయితే, విచారణ సమయంలో దర్శన్ సహాయకుడి ఫోన్ నుంచి ఈ ఫోటోలను పోలీసులు సేకరించారు.
Gujarat: గుజరాత్లో దారుణం జరిగింది. మనవడిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాల్సిన బామ్మే కసాయిగా మారింది. 14 నెలల చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి చంపింది. రాష్ట్రంలోని అమ్రేలి తాలుకాలో ఈ ఘటన జరిగింది. నిందితురాలైన మహిళ మనవడు నిరంతరం ఏడుస్తున్నాడనే కోసంతో అతడిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు.
Bengaluru: బెంగళూర్‌లో ఆటో రైడ్ క్యాన్సిల్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రైడ్ యాప్ ద్వారా ఆటోని బుక్ చేసుకున్న మహిళా ప్రయాణికురాలు రైడ్‌ని క్యాన్సిల్ చేసుకున్నందుకు సదరు ఆటో డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడ్డారు.
Udaipur tailor Murder: 2022లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిని ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. టైలర్ కన్హయ్యలాల్‌ని దారుణంగా హత్య చేసిన నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్‌కి రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జూలై 22, 2022న ఉదయ్‌పూర్‌లో జావేద్‌ని అరెస్ట్ చేసింది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మసీదు నిర్మాణం వివాదాస్పదమవుతోంది. మసీదును అక్రమంగా నిర్మిస్తు్న్నారని సిమ్లాలో స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ రోజు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సంజౌలిలోని మార్కెట్ పక్కనే నిర్మిస్తున్న మసీదు చట్టవిరుద్ధంగా ఉందని, అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
Karnataka: కర్ణాటకలో బీదర్‌లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.