Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి.
Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ(బీజేపీలో) చేరారు. సెప్టెంబర్ 02న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజీ పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోని పోస్ట్ చేశారు.
Ukraine conflict: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలు మొదలవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని పుతిన్ గురువారం చెప్పారు. యుద్ధం ప్రారంభంలో టర్కీ మధ్యవర్తిత్వం చేసి కొన్ని ఒప్పందాలను చేసుకున్నప్పటికీ, చివరకు అవి ఎన్నడూ అమలు చేయబడలేదని చెప్పారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ […]
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్ ఆమెను అప్పగించాలని ఇండియాను కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని కోరారు. ఇది బంగ్లాకు, భారత్‌కి మంచిదని చెప్పారు. భారత్‌తో బంగ్లా బలమైన సంబంధాలకు విలువనిస్తుండగా, ‘‘ అవామీ లీగ్ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఇస్లామిక్‌గా చిత్రీకరించి, షేక్ హసీనా లేకుండా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని విడిచి న్యూఢిల్లీ ముందుకు సాగాలి’’ యూనస్ అన్నారు.
IC-814 hijacking: ది కాందహార్ హైజాక్' నెట్ఫ్లిక్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాలో సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ‘‘హర్కత్ ఉల్ ముజాహీదీన్’’ ఉగ్రవాదులు ఐదుగురు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తరలించారు.
తాజాగా దాడి సమయంలో రేణుకాస్వామి ఎలా చిత్ర హింసలు అనుభవించాడని సూచించే ఫోటోలో వైరల్‌గా మారాయి. ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. పార్క్ చేసిన ట్రక్కు ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. మరో చిత్రంలో అతడి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ట్రక్కు ముందు అపస్మారక స్థితిలో కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, వరసగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ని మమతా సర్కార్ ఈ రోజు బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ) బిల్లు, 2024కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అత్యాచార దోషుల చర్యలు బాధితురాలి మరణానికి దారి తీస్తే మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడలో మంగళవారం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 09 మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.
Wife Harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని రికార్డ్ చేశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను పెళ్లి వల్ల ఎంత నరకం అనుభవించానే విషయాన్ని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంటనీరు తెప్పిస్తోంది.
IC 814 The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘‘IC 814 ది కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC 814 హైజాక్ ఘటన ఇతివృత్తంగా ఈ సిరీస్ రూపొందించబడింది. అయితే, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదాలకు కేరాఫ్‌గా మారింది.