Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్‌లో జరిగినట్లు వారు తెలిపారు.
Read Also: Zimbabwe: జింబాబ్వేలో తీవ్ర ఆహార సంక్షోభం.. 200 ఏనుగుల్ని చంపేందుకు అనుమతి..
ఊరేగింపులో, పాలస్తీనా జెండాను పోలిన జెండాతో ఒక యువకుడు కనిపించాడు, మేము జెండాను స్వాధీనం చేసుకున్నాము మరియు అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతను హెచ్చరించినట్లు అదనపు డీసీపీ అనిల్ మిశ్రా ఇక్కడ విలేకరులతో అన్నారు. ఊరేగింపుని కొద్దిసేపు నిలిపేసిన తర్వాత నిర్వాహకులతో పోలీస్ అధికారులు చర్చించి, మళ్లీ ఊరేగింపుకు అనుమతి ఇచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జెండాని స్వాధీనం చేసుకున్నట్లు డీసీసీ తెలిపారు.
‘‘పాలస్తీనా జెండాలో మాదిరిగానే మూడు రంగులు ఉన్నాయని, అయితే పాలస్తీనా జెండాలో ఉండే త్రిభుజం లేదని, ఆ స్థానంలో ఏదో రాసి ఉందని, కాబట్టి ఇది పూర్తిగా పాలస్తీనా జెండాను సూచించే విధంగా లేదు’’ అని పోలీస్ అధికారి వెల్లడించారు. మిలాద్-ఉన్-నబీ రోజున మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని స్మరించుకుంటుంది.