Drug-Resistant Superbugs: 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది డ్రగ్ రెసిస్టెంట్ సూపర్‌బగ్స్ ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తారని అంచానా వేయబడింది. సూపర్‌బగ్‌లు — యాంటీబయాటిక్స్‌కు నిరోధకంగా మారిన బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులు, వాటికి చికిత్స చేయడం చాలా కష్టతరం చేస్తాయి. ఇది ప్రపంచ ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పుగా చెప్పబడుతోంది. ది లాన్సెట్ జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం, 1990 మరియు 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సూపర్ బగ్స్ లేదా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(AMR) ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది మరణించినట్లు చెప్పింది.
గత మూడు దశాబ్దాల్లో సూపర్‌బగ్‌ల వల్ల ఐదేళ్లలోపు పిల్లల మరణాలు వాస్తవానికి 50 శాతానికి పైగా తగ్గాయని, శిశువులకు అంటువ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి మెరుగైన చర్యలే ఇందుకు కారణమని అధ్యయనం తెలిపింది. అయితే, ఇప్పుడు పిల్లలు సూపర్ బగ్స్ బారిన పడితే చికిత్స చేయడం చాలా కష్టమని ఒక పరిశోధన చెప్పింది. ఇదిలా ఉంటే, 70 ఏళ్లకు పైబడిన వారిలో మరణాలు ఇదే కాలానికి 80 శాతానికి పెరిగాయి. ఈ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్ల బారినపడిన వృద్ధులు సులువుగా లొంగిపోయే అవకాశం ఉంటుంది.
Read Also: Ganesh Immersion Live Updates: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు.. లైవ్ అప్డేట్స్
యాంటీబయాటిక్స్‌కి నిరోధకతను కలిగి ఉన్న ఒక రకమైన స్టాఫ్ బ్యాక్టీరియా MRSA యొక్క ఇన్‌ఫెక్షన్ల వల్ల మరణాలు మూడు దశాబ్దాల క్రితం నుండి 2021 నాటికి 130,000కి రెట్టింపు అయ్యాయని అధ్యయనం తెలిపింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే.. AMR వల్ల ప్రత్యక్ష మరణాల సంఖ్య 67 శాతం పెరిగి 2050 నాటికి ఒక ఏడాదికి దాదాపుగా 2 మిలియన్లకు చేరుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పరిశోధకులు మోడలింగ్ ప్రకారం.. ఇది మరో 8.2 మిలియన్ల మరణాలకు కూడా కారణమవుతుంది. ఆ తర్వాత పావు శతాబ్ధంలో 39 మిలియన్ల మందిని నేరుగా చంపుతుంది. మొత్తంగా 169 మిలియన్ల మరణాలకు దోహదపడుతుంది.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి యాంటీ బయాటిక్స్‌ని వాడుతాం. అయితే, వీటి మితిమీరిన వినియోగం వల్ల బ్యాక్టీరియాలు వీటిని తట్టుకుని సూపర్‌బగ్స్‌గా మారేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒక వేళ ఇదే జరిగితే, యాంటీ బయాటిక్స్‌కి బ్యాక్టీరియా లొంగకపోవడంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. పరిశోధకులు 22 వ్యాధికారక కారకాలు, 84 మందులు మరియు వ్యాధికారక కారకాల కలయికలు మరియు మెనింజైటిస్ వంటి 11 ఇన్ఫెక్షియస్ సిండ్రోమ్‌లను పరిశీలించారు. ఈ అధ్యయనం 204 దేశాలతో పాటు 520 మిలియన్ల వ్యక్తిగత రికార్డుల నుంచి డేటాను కలిగి ఉంది.