Pakistan: పాక్‌లో బలూచ్ మిలిటెంట్లు చైనానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? భారత్ హస్తముందా..?
- పాక్‌లో చైనీయులే టార్గెట్‌గా బీఎల్ఏ దాడులు..
- తాజా కరాచీ దాడిలో ఇద్దరు చైనా జాతీయుల మృతి..
- చైనానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..
- భారత హస్తంపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు తెహ్రీక్ ఇ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులతో సతమతం అవుతోంది. ఈ రెండు గ్రూపులు ఒకరు ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో విరుచుకుపుడుతున్నాయి. ముఖ్యంగా బీఏల్ఏ మిలిటెంట్లు పాకిస్తాన్ సైన్యం, పోలీసులతో పాటు చైనీయులను టార్గెట్ చేస్తున్నారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కరాచీ విమానాశ్రయానికి సమీపంలో కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఇద్దరు చైనా జాతీయులు మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడానికి వారం రోజుల ముందు బాంబు పేలుడు సంభవించింది. బీఎల్ఏ చైనా ప్రాజెక్టుల్ని, ఆ దేశస్తుల్ని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దాడులు జరిగాయి. ఈ దాడిపై చైనా స్పందించింది. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చైనా పాకిస్తాన్‌ని కోరింది. తాజా జరిగిన దాడి కాన్వాయ్ పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందినది. పోర్ట్ ఖాసిమ్ ప్రాజెక్ట్ కరాచీ సమీపంలో రెండు బొగ్గు విద్యుత్ ప్లాంట్‌లను నిర్మిస్తుంది. ఇది సీపెక్‌లో భాగంగా ఉంది.
Also Read
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
చైనానే ఎందుకు లక్ష్యం:
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ని జిన్నా ప్రభుత్వం బలవంతంగా భయపెట్టి కలుపుకుంది. చర్చల పేరుతో బలూచిస్తాన్ ప్రభుత్వ నేతని పిలిచి, బలవంతంగా సంతకం చేయించారు. 1947లో ఇది జరిగింది. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతూనే ఉన్నారు. ఈ తిరుగుబాటులో పాల్గొంటున్న వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేయడం, హత్యలు చేయడం జరిగింది. అనేక దశాబ్ధాలుగా అక్కడి ప్రజలు తీవ్ర అణిచివేతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎల్ఏ పాక్ ప్రభుత్వంపై దాడులు చేస్తోంది.
పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సుల, అతి తక్కువ జనాభా కలిగిన బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సుని, గ్వాదర్ పోర్టుని కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ ప్రజల్లో ఉంది. దీంతో వారు చైనాపై దాడులు చేస్తున్నారు.
చైనాకు చమురు లేదా ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్కా జల సంధిపై ఆధారపడుతుంది. ఎప్పుడైనా భారత్‌తో ఉద్రిక్తలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని భారత్ దిగ్భందించవచ్చు. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది.
భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు:
బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి భారత్ మద్దతు ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ ఆధారిత థింక్ ట్యాంక్ AIERD యొక్క CEO అయిన షకీల్ అహ్మద్ రామీ ప్రకారం.. ఈ మిలిటెంట్లు విదేశీ శక్తుల ఎజెండాను నెరవేరుస్తున్నారని పరోక్షంగా భారత్‌ని ఉద్దేశించి అన్నారు. చైనా-పాక్ సంబంధాల్లో చిచ్చు పెట్టేందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, పలు సందర్బాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. ఇదే భారత్‌పై ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్‌కి కారణమవుతోంది.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!