BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు.
విదేశాంగ మంత్రి జైశంకర్ డిన్నర్ చేయాల్సి వస్తే జార్జ్ సోరోస్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్లలో ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నిస్తే, జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 30కి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఎప్పుడూ జరగలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీకి పిలుపునిచ్చారు.
ఈ వివాదాస్పద మసీదు అంశం కోర్టుకు చేరింది. సిమ్లాలోని మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా కోర్టు ఈ రోజు ఆదేశించింది. సంజౌలీ మసీదు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసేందుకు మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా మున్సిపల్ కమిషనర్ కోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది.
Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతని అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్‌కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్లో ఇటు బీజేపీ కానీ, అటు ఎన్సీ- కాంగ్రెస్ కూటమి కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుంటే, కాశ్మీర్‌లోయలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే, మొత్తం జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 46 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్‌ని సాధించలేవని సర్వేలు చెబుతున్నాయి.
Haryana Exit Poll 2024: లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్. ఈ సంఖ్య చేరుకున్న పార్టీలు ప్రభుత్వాన్ని…
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి.
Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో నిరసనలకు ప్లాన్ చేశారు.
Congress: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.