Iran: ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మిస్సింగ్.. ఇజ్రాయిల్ దాడుల్లో హతం..
- ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ మిస్సింగ్..
- బీరూట్‌పై ఇజ్రాయిల్ దాడుల్లో హతం..?
- ఖాసీం సులేమాని తర్వాత బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్‌లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.
లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేహ్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు హిజ్బుల్లా కొత్త చీఫ్, చనిపోయిన నస్రల్లా వారసుడిగా చెప్పబడుతున్న హషీమ్ సఫిద్దీన్‌ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల తర్వాత సఫీద్దీన్ కూడా అందుబాటులో లేనట్లు తెలిసింది. ఇతను చనిపోయి ఉంటాడని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి.
Also Read
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
- Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
ఇజ్రాయిలీ మీడియా ప్రకారం.. ఇరాన్ బ్రిగేడియర్ ఖానీ ఆ సమయంలో దహియేహ్‌లోనే ఉన్నాడని పేర్కొంటున్నాయి. ఇరాన్ కమాండర్ మరణానికి సంబంధించి ఇజ్రాయిల్ ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, లెబనీస్ అధికారులు మాత్రం ఖానీ మరణాన్ని ధృవీకరించారని ఇజ్రాయిల్ వార్తా సంస్థ ఛానెల్ 12 పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇతను ఇజ్రాయిల్ మోసాద్‌కి సహకరిస్తున్నాడని ఇరాన్ ఉరితీసి ఉండొచ్చని కొన్ని సౌదీ వార్తా ఛానెళ్లు చెబుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ శుక్రవారం ప్రార్థనల సమయంలో ఖానీ గైర్హాజరయ్యాడు.
ఇస్మాయిల్ ఖానీ ఎవరు..?
గతంలో ఖుద్స్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న ఖాసిమ్ సులేమానిని 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఏయిర్‌పోర్టులో అమెరికా డ్రోన్ దాడిలో హతం చేసింది. సులేమానీ హత్య తర్వాత, ఇరాక్ సైనిక వ్యూహాన్ని రూపొందించడంలో ఖానీ కీలక పాత్ర పోషించాడు. ఖుద్స్ ఫోర్స్ బాధ్యతలు తీసుకునే ముందు ఖానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించాడు.
తాజావార్తలు
-
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!