Shocking: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి..
- పాకిస్తాన్‌లో దారుణం..
- బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని 13 మంది కుటుంబ సభ్యుల హత్య..
- విషం పెట్టి చంపిన యువతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ ఘటన సింధ్ ప్రావిన్సులోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.
నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిపించాలని యువతి కుటుంబ సభ్యులను కోరినప్పటికీ, వారు దానికి అంగీకరించలేదు. దీంతో వీరందర్ని చంపేందుకు గోధుమ పిండిలో విషం కలిపి, చపాతీలు చేసి 13 మంది కుటుంబ సభ్యులకు వడ్డించింది. వీటిని తిన్న తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందరు మరణించారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆగస్టు 19న రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే 9 మంది కుటుంబ సభ్యులు మరణించగా, మరో నలుగురు మరుసటి రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. షైస్తా బ్రోహిని అనే యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమీర్ బక్ష్‌తో షైస్తా ప్రేమలో ఉందని తేలింది. తమ పెళ్లికి కుటుంబం అంగీకరించలేదని చెప్పింది. అమీర్ తనకు ఓ లిక్విడ్ ఇచ్చి ఆహారంలో కలపమని చెప్పినట్లు వెల్లడించింది. ఇది తిన్న తర్వాత మీ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని అతను చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం షైస్తా, అమీర్ బక్ష్‌లను అరెస్ట్ చేశారు.
పోస్ట్ మార్టం నివేదికలో విష ప్రయోగం జరిగినట్లు తేలింది. పోలీసుల విచారణలో కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఇంట్లో రోటీలు తయారు చేసే పిండిలో విషం కలిపినట్లు తేలిందని ఖైర్‌పూర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా తెలిపారు. ఈ హత్యలకు యువతి, ఆమె లవర్ కలిసి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. తన ప్రియుడి సాయంతోనే విష ప్రయోగం చేసినట్లు యువతి అంగీకరించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?