Indian Railways: ముంబైకి చెందిన వరుడు, అస్సాం గౌహతిలోని పెళ్లి వేదికకు చేరుకునేందుకు ఇండియన్ రైల్వే చేసిన సాయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సకాలానికి అతడు వధువుని చేరుకునేలా రైల్వే సాయం చేసింది.
Amit Shah: ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బహిరంగంగా మద్దతు…
Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్గా గుర్తించారు.
Woman drown: కర్ణాటక మంగళూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టుల్లో విషాదం నెలకొంది. వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది. మైసూర్‌కి చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రిసార్టులోని స్మిమ్మింగ్ పూల్‌లో ముగినిపోయి మరణించారు. ప్రైవేట్ బీచ్ రిసార్టులో ఈ ఘటన జరిగింది.
The Sabarmati Report: గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు.
US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యూఎస్ సరిహద్దు గస్తీ డేటా ఈ వివరాలను చెబుతోంది. భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. యూఎస్ సరిహద్దు డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా భారతీయులు అరెస్టయ్యారు. ఇది కేవలం రెండేళ్లలో…
PM Modi: ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా వెళ్లారు. నైజీరియాతో పాటు జి-20 సమ్మిట్ జరిగే బ్రెజిల్‌తో పాటు దక్షిణ అమెరికా దేశమైన గయానాలో కూడా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేసింది.
Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Chicken: శాఖాహారం తినే ఇంటికి చికెన్ తీసుకువచ్చిన సోదరుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగింది. చికెన్ వ్యవహారంలో సోదరుడి హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించడంతో ఆమెను కూడా నిందితురాలిగా పోలీసులు చేర్చారు. Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు వివరాల ప్రకారం.. అన్షుల్ అనే వ్యక్తి తన ఇంటి […]