Chennai: చాలా కంపెనీలు ఉద్యోగుల కన్నా వారికి వచ్చే లాభాలపైనే దృష్టి పెడుతాయి. మనం ఈ స్థాయికి వెళ్లేందుకు ఉద్యోగులు సహకరించారనే విషయాన్ని మరిచిపోతుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు కార్లు, బంగ్లాలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాయి.
Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
Anmol Bishnoi: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఆశ్రయం కోరుతున్నట్లు సమచారం. భారత్‌లో జరిగిన పలు హై ప్రొఫైల్ హత్యల్లో్ అన్మోల్ బిష్ణోయ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. బిష్ణోయ్ గల వారంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో అరెస్ట్ చేయబడ్డాడు. నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించినందుకు బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం అయోవాలోని పొట్టవట్టమీ కౌంటీ జైలులో ఉన్నాడు.
Earth's Magnetic Poles: భూమి అయస్కాంత క్షేత్రం వేగం మార్పులకు గురవుతున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా చెప్పారు. లైవ్ సైన్స్ ప్రకారం.. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది కెనడా నుంచి సైబీరియా వైపు 2250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని కదలిక ఇటీవల కాలంలో వేగవంతమైంది. 1990-2005 మధ్య కదలిక రేటు గంటకు 15 కి.మీ నుంచి 50-60 కి.మీకి పెరిగింది.
Isaral-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి.
Viral Video: ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముఖ్యంగా దాంట్లో ‘‘సన్‌రూఫ్’’ ఫీచర్ ఉందా..? లేదా..?అనేది చూస్తున్నారు. సన్‌రూఫ్ ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎస్యూవీ సెగ్మెంట్లోని ప్రతీ కారుకి కూడా సన్‌రూఫ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేఠ ఆ రాష్ట్రంలోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఒక దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభించడం సంచలనంగా మారింది. ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు, ఈ నేరం వెనక రాజకీయ ఉద్దేశ్యం ఉన్నట్లు యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Jharkhand Elections: రేపు జార్ఖండ్ చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి అయితే, ఇప్పుడు బీహార్ పూర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందిన ‘‘పప్పూ యాదవ్’’ ప్రచారం వైరల్‌గా మారింది. ఇండియా కూటమి తరుపున ఓట్లు అడుగుతున్న ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో మైనారిటీ వ్యతిరేకత, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పనిగట్టుకుని హిందువుల వ్యాపారాలు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వరదలు సంభవిస్తే, అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఇస్కాన్ సంస్థనే ఇప్పుడు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆన్లైన్ క్యాంపెయినింగ్ నడుస్తోంది.