The Sabarmati Report: నిజం బయటపడుతోంది..గోద్రా విషాదంపై తెరకెక్కిన ‘‘ది సబర్మతి రిపోర్ట్’’పై ప్రధాని ప్రశంసలు..
- ‘‘ ది సబర్మతి రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని ప్రశంసలు..
- 2002 గోద్రా విషాదం ఆధారంగా తెరకెక్కిన సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Sabarmati Report: గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. “ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూడగలిగే విధంగా” అని విక్రాంత్ మాస్సే నటించిన చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ అన్నారు.
2002 గోద్రా విషాదం వెనక దాడి ఉన్న నిజాన్ని బహిర్గతం చేయడంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ధీరనజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 2002లో గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు, దారితీసిన విషాదం గురించి వివరించింది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినమా నవంబర్ 15న విడుదలైంది.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
Read Also: Minister Nadendla Manohar: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!
గోద్రా విషాదం:
ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్ పూర్ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు.
రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్‌ని చాలా సార్లు లాగినట్లు డ్రైవర్ తెలిపారు. దీనివల్ల స్టేషన్ వెలువలి సిగ్నల్ వద్ద రైలు ఆగిపోయింది. ఆ తర్వాత భారీ దాడి జరిగింది. 2000 మంది వ్యక్తుల గుంపు రైలుపై రాళ్లను రువ్వారు. నాలుగు కోచ్‌లను తగలబెట్టారు.
S-6 కోచ్ ఎక్కువగా ప్రభావితమైంది మరియు అగ్నిప్రమాదంలో 27 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గోద్రా తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు జరిగాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు చనిపోయారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..