Bengaluru: ఒక యువతి, ఆటో డ్రైవర్‌కి జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు యువతి ఒకేసారి రెండు ఆటోలను బుక్ చేసి, చివరి నిమిషంలో ఒక దానిని క్యాన్సిల్ చేసినట్లు ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. అయితే, తాను బుక్ చేయలేదని యువతి, ఆటో డ్రైవర్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒకానొక సమయంలో యువతి ఆవేశంతో ఆటో డ్రైవర్ని దుర్భాషలాడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో డ్రైవర్ తన…
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఈ చెకింగ్ జరిగాయి.
Bigg Boss 18: ప్రధాని నరేంద్రమోడీ మాజీ బాడీగార్డ్ లక్కీ బిష్త్ బిగ్ తాను బిగ్ బాస్ 18 ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. మాజీ ‘‘రా’’ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లక్కీ బిష్త్ పొల్గొనాలని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు బిష్త్ ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేశారు.
Mutton Curry: మటన్ ముక్కుల కొట్లాటకు దారి తీసింది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందులో ఈ గలాటా జరిగింది. నవంబర్ 14న జరిగిన ఈ విందు కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వెయ్యి మందికి పైగా ఆహ్వానించినప్పటికీ, హాజరైన వారు కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీ మాత్రమే వడ్డించడంపై అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan: పాకిస్తాన్‌తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ "ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు"గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Devendra Fadnavis: నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ..
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2025-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య 6.7 వృద్ధిరేటు సగటున కలిగి ఉంటుందని, 2031 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇది క్యాపెక్స్ పుష్, ప్రొడక్టివిటీ పెరుగుదల వల్ల సాధ్యం అవుతుందని, కోవిడ్ మహమ్మారికి ముందు దశాబ్ధంలో చూసిన 6.6 శాతం వృద్ధికి సమానంగా
Maharashtra: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ నినాదం బీజేపీ కూటమిలో కూడా చిచ్చురేపుతోంది. బీజేపీ మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించాడు. ఇది జార్ఖండ్, యూపీ ప్రాంతాల్లో పనిచేస్తుందని కానీ, మహారాష్ట్రలో నినాదం పనిచేయదంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.