Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Anna University Incident: చెన్నైలోని అన్నాయూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అధికార డీఎంకే సర్కార్‌పై, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు.
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.
Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
PM Modi: వచ్చే ఏడాది ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దౌత్య పర్యటనలు జరిగే అవకాశం కనిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే రెండు దేశాలు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకునే ఒప్పందం కుదిరింది. ఇటీవల రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్ సమావేశమయ్యారు.
AAP: ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
China: సాంప్రదాయ యుద్ధం నుంచి నెమ్మదిగా ప్రపంచ దేశాలు హై టెక్నాలజీ వైపు దృష్టిసారిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది.
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.