UDAN Yatri Cafe: విమానాశ్రయాల్లోకి వెళితే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అల్పాహారం వరకు ధరలు మండిపోతుంటాయి. అయితే, వీటికి ఉపశమనం కల్పించేందుకు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల కోసం ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అధిక ధరల్ని నిరోధించడానికి, విమాన యాత్రికులకు అందుబాటులో ధరలు ఉంచాలని లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ […]
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటర్ సంఖ్య గణాంకాలలో లేదా ఓటర్ బాబితా నుంచి ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు చేయలేదని ఈసీ చెప్పింది. అక్టోబర్ 19న మహారాష్ట్ర ప్రతిపక్ష ‘‘మహా వికాస్ అఘాడీ’’ పలు అంశాలపై ఎన్నికల కమిషన్ని కలిసింది. సాయంత్రం 5 గంటల ఓటింగ్ శాతం, తుది గణాంకాల్లో ఓటింగ్ శాతం మధ్య తేడాల గురించి ఈసీకి ఫిర్యాదు చేసింది.
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు.
మహిళా జర్నలిస్టుల సమావేశంలో ధన్ఖర్ మాట్లాడుతూ.. ‘‘తాను నోటీసులు చూసి ఆశ్చర్యపోయాను, కానీ నన్ను మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మీరెవరూ చదవులేదు. ఒక వేళ మీరు దానిని చదివి ఉంటే రోజుల తరబడి నిద్రపోయే వారు కాదు’’ అని ఆయన అన్నారు.
Pakistan: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ప్రజలు అడుక్కుతింటున్నా పాకిస్తాన్ మాత్రం తన సైనిక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గేమ్ ఛేంజింగ్‌గా మారే మిలిటరీ డీల్‌కి దాయాది దేశం సన్నద్ధమవుతోంది. అత్యాధునిక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ J-35Aలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. చైనా నుంచి 40 అధునాతన స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి ఇస్లామాబాద్, చైనాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Bengaluru: బెంగళూర్‌పై నార్త్ ఇండియా మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమవుతున్నాయి. అయితే, ఆమెకు చాలా మంది మద్దతు లభించడం విశేషం. ఓ వీడియో క్లిప్‌లో తాను బెంగళూర్‌లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తెలియజేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మహిళ ఎదుర్కొన్న ‘‘కల్చరల్ షాక్’’ గురించి ప్రశ్నిస్తాడు. దీనికి మహిళ..‘‘నాకు కల్చరల్ షాక్ గురించి తెలియదు, కానీ ఇక్కడి ప్రజలు ఉత్తర భారతీయులను ద్వేషిస్తారు. అదే నేను గమనించాను’’ అని చెప్పింది.
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్‌కి దగ్గరవుతోంది.
Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనీయే ఈ ఏడాది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అనూహ్య రీతిలో హత్యకు గురయ్యాడు. ఆయన నివసిస్తున్న హోటల్లో భారీ పేలుడుతో మరణించాడు. అయితే, ఈ హత్య చేసింది ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొస్సాద్ అంటూ ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపించాయి. అయితే, ఇప్పటి వరకు తామే ఈ హత్య చేసినట్లు ఇజ్రాయిల్ ఎక్కడా చెప్పలేదు.
Rajasthan: మూడేళ్ల బాలిక, 700 అడుగుల బోరు బావిలో పడిన సంఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు గత 20 గంటల నుంచి బాలికను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతన అనే బాలిక తన తండ్రి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బాబిలో పడిపోయింది. దాదాపుగా 150 అడుగుల లోతులో ఆమె చిక్కుకుపోయింది. ఆమె కదలికల్ని కెమెరాల ద్వారా గమనిస్తున్నారు.
UN peacekeeping force: ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యుఎన్డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేస్తున్న బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆయన మరణించే సమయంలో మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు.