Air Travel: విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని తీసుకువచ్చింది. ఇప్పుడు విమానాల్లో హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితుల్ని విధించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో ప్రయాణికులు విమానంలో ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను నిర్వహించడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని పంచడానికి ప్రభుత్వం ఈ […]
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం ఎయిమ్స్‌లో మరణించారు. దాదాపుగా దివాళా అంచున ఉన్న దేశాన్ని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుంది. అప్పటి వరకు లైసెన్స్ రాజ్, బ్రూరోక్రసీ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థగా మార్చారు.
Manmohan Singh: రెండు సార్లు భారత ప్రధానిగా, సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మనదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేదని. దేశాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా […]
Congress: బీజేపీపై మరింతగా దాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, రాజ్యాంగాన్ని అణగదొక్కారని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది.
Income Tax: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులపై ‘‘ఆదాయపు పన్ను’’ తగ్గించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi: మహాత్మా గాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్ధాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం […]
Simran Singh: పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆర్జే సిమ్రాన్ సింగ్ తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. బుధవారం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47 వద్ద అద్దె అపార్ట్మెంట్లో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు.
China: చైనా తన అమ్ములపొదిలో కొత్తగా రూపొందించిన స్టెల్త్ ఫైటర్ జెట్‌ని తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 6వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ని ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపించాయి.
CRIME: గర్భం దాల్చడం లేదని, ఇలాగైతే తాను నిన్ను వదిలేసి వేరే మహిళను చూసుకుంటానని భర్త చెప్పడం ఆయన హత్యకు కారణమైంది. ఛత్తీస్‌గఢ్ లోని సుర్గుజా జిల్లాలో బుధవారం ఈ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య గొడ్డలితో నరికి చంపింది. తనకు బిడ్డను కనివ్వకుంటే తానను వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో కోపంతో భార్య అతడిని చంపేసింది.
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో జార్జ్ సోరోస్‌తో సంబంధాలు, రాహుల్ గాంధీ ఎంపీలను తోసివేయడం వంటి అంశాలపై బీజేపీ ఆ పార్టీని కార్నర్ చేసింది. తాజాగా కాంగ్రెస్ ‘‘భారతదేశ మ్యాపు’’ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.