Anna University Incident: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అధికార డీఎంకే సర్కార్‌పై, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని చెప్పారు. ఇదిలా ఉంటే, అత్యాచార నిందితుల్లో ఒకరు డీఎంకే కార్యకర్త అని బీజేపీ ఆరోపించింది. నిందితుడు జ్ఞానశేఖరన్ సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లో ఉన్న ఫోటోలను బీజేపీ షేర్ చేసింది.
జ్ఞానశేఖరన్ డీఎంకే సైదాయి తూర్పు విద్యార్థి విభాగానికి డిప్యూటీ ఆర్గనైజర్ అని అన్నామలై ఆరోపించారు. ‘‘తమిళనాడు అంతటా ఇలాంటి క్రిమినల్ కేసులలో స్పష్టంగా ఓ విషయం వెలుగులోకి వస్తోంది, ఒక నేరస్తుడు డీఎంకే కార్యకర్త. ఆ ప్రాంతంలోని డీఎంకే కార్యనిర్వాహకులకు సన్నిహితంగా ఉంటాడు. అతనిపై నమోదైన కేసులన్నీ కొట్టివేయబడుతున్నాయి. క్రిమినల్ రికార్డ్ ఉన్న నేరస్థుడిగా వర్గీకరించబడకుండా,స్థానిక పోలీసు స్టేషన్ యొక్క వాచ్ లిస్ట్‌లో ఉంచకుండా అతన్ని విడుదల చేస్తున్నారు. స్థానిక డీఎంకే అధికారులు మరియు మంత్రుల ఒత్తిడి కారణంగా, పోలీసులు అతనిపై కేసులను విచారించడం లేదు. ఇది అతడి తదుపరి నేరాలకు అవకాశం ఇస్తుంది’’ అని ఎక్స్ వేదికగా అన్నామలై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: Vemulawada: రాజన్న ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారం.. అధికారుల పొంతన లేని సమాధానం
15 లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తిపై ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్లే ఈరోజు ఓ అమాయక విద్యార్థిపై ఈ దారుణం జరిగింది.దీనికి పూర్తి బాధ్యత డీఎంకే ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులను ప్రజలు ఎంతకాలం సహించాలి..? అధికార పార్టీ సభ్యుడైతే నేరస్తులపై చర్యలు తీసుకోవద్దనే చట్టం తమిళనాడులో ఉందా..? అని అన్నామలై ప్రశ్నించారు. మరోవైపు ప్రతిపక్ష ఏఐడీఎంకే కూడా స్టాలిన్ సర్కారుపై విరుచుకుపడుతోంది. అన్నా యూనివర్శిటీలో సీసీటీవీలు పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అనడం పంచదారని చీమలు తిన్నట్లుగా ఉందని మాజీ సీఎం పళని స్వామి విమర్శించారు. అయితే, డీఎంకే మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది.
అన్నా యూనివర్సిటీ ఘటన విషయానికి వస్తే సోమవారం రాత్రి 8 గంటల సమయంలో క్యాంపస్‌లో బాధిత యువతిన తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి, యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ చర్యను నిందితులు రికార్డ్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. జ్ఞానశేఖరన్ అనే 37 ఏళ్ల వ్యక్తి నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
அண்ணா பல்கலைக்கழகத்தில், மாணவி பாலியல் வன்கொடுமைக்கு ஆளான வழக்கில் கைதாகியுள்ள ஞானசேகரன் என்ற நபர், ஏற்கனவே இது போன்ற குற்றங்களில் பல முறை ஈடுபட்டவர் என்பதும், அவர் திமுகவின், சைதை கிழக்கு பகுதி மாணவர் அணி துணை அமைப்பாளர் என்பதும் தெரிய வந்துள்ளது.
தமிழகம் முழுவதும், இதுபோன்ற… pic.twitter.com/K1ahEoIqE0
— K.Annamalai (@annamalai_k) December 25, 2024