Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్‌స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Bangladesh: బంగ్లాదేశ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సంజీబ్ వాజెద్ సంచలన ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ నాయకులపై వేధింపుల కోసం న్యాయవ్యవస్థను యూనస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు పక్షపాత విచారణ నిర్వహించాలని వాజెద్ కోరారు.
UP: డబ్బుల కోసం మగాళ్లను పెళ్లాడుతున్న ఓ లేడీ ఖిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నిత్య పెళ్లికూతురు’’ మారిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బండాకి చెందిన ఇద్దరు మహిళలు చాలా మంది మగాళ్లను, ఒంటరి పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసి, వారి ఇళ్లలోని నగదు, ఆభరణాలను దొంగిలించే రాకెట్ నడుపుతున్నట్లు తేలింది.
Pakistan Air Strikes: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో 46 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు.
2020 ఢిల్లీ అల్లర్లలో పోలీసులకు తుపాకీ గురిపెట్టి ప్రాచుర్యం పొందిన నిందితుడు షారుక్ పఠాన్ కుటుంబాన్ని ఢిల్లీ ఎంఐఎం పార్టీ చీఫ్ డాక్టర్ సోయబ్ జమై కలిశారు. ఇప్పుడు ఈ కలయిక వివాదాస్పదంగా మారింది. అల్లర్ల సమయంలో పోలీసులకు తుపాకీని గురిపెట్టిని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
Serial killer: పంజాబ్‌లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్పూర్ జిల్లాలో గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్గా గుర్తించారు.
Anna University: చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు.
Ramtek bungalow: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, శివసేన ఏక్నాథ్ షిండేల ‘‘మహాయుతి’’ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు మంత్రులు నియామకం కూడా జరిగింది.
Ajay Kumar Bhalla: మణిపూర్ గవర్నర్‌గా మాజీ హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా నియమితులైనట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. మే 2003 నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న జాతి హింస నేపథ్యంలో భల్లా నియామకం జరిగింది.