Bank Holidays In January: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందు దేశవ్యాప్తంగా అందరూ సిద్ధమయ్యారు. అయితే, 2025 జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండటంతో ముందుగా మన లావాదేవీలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. జనవరిలో దాదాపుగా బ్యాంకులకు 15 రోజుల పాటు సెలువులు ఉంటున్నాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 తేదీతో బ్యాంక్ సెలవులు ప్రారంభమవుతున్నాయి.
Congress: భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరణించారు. అయితే, ఆయన మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయింపుపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. అధికార బీజేపీ రాజకీయాలు ఆడుతోందని ఆరోపించారు. ఒక వేళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాజ్‌ఘాట్‌లో స్మారక చిహ్నం లేకపోతే ఆ పార్టీకి ఎలా అనిపిం
Congress: ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వైద్య సమస్యలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటుగా నేతలు అభివర్ణిస్తున్నారు.
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడులో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార డీఎంకే పార్టీ కార్యకర్త నిందితుల్లో ఒకరని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సాక్ష్యాంగా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌తో ఉన్న నిందితుడి ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
Kazakhstan Plane Crash: అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఎంబ్రేయిర్-190 విమానం రష్యాకు వెళ్తూ కజకిస్తాన్‌లో కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారియి. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.న ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, 29 మంది ప్రాణాలు దక్కాయి.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Osamu Suzuki: జపనీస్ ఆటోమొబైల్స్ దిగ్గజం సుజుకి మోటార్ ఛైర్మన్, సీఈఓ ఒసాము సుజుకి(94) కన్నుమూశారు. ప్రాణాంతక లింఫోమాతో పోరాడుతూ డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తోషిహిరో సుజుకి తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇసాము సుజుకి 1930 జనవరి 30న ఓ జపనీస్ వ్యవసాయ కుటుంబంలో 4వ సంతానంగా జన్మించారు. మొదట్లో రాజకీయ నాయకుడు కావాలని ఆశించిన సుజుకీ, ఆ తర్వాత […]
Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్తగా కొనియాడుతోంది. ఆయన మరణం పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Japan: అక్టోబర్‌లో ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబాని ఓ భయం వెంటాడుతోంది. జపాన్ ప్రధాని అధికార నివాసంలో ‘‘దెయ్యాలు’’ ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ ఇంటికి వెళ్లేందుకు జంకుతున్నారు.
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్‌ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారు.