Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
- మన్మోహన్ స్మారకంపై రాజకీయ దుమారం..
- బీజేపీ రాజకీయం చేస్తోందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరణించారు. అయితే, ఆయన మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయింపుపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. అధికార బీజేపీ రాజకీయాలు ఆడుతోందని ఆరోపించారు. ఒక వేళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాజ్‌ఘాట్‌లో స్మారక చిహ్నం లేకపోతే ఆ పార్టీకి ఎలా అనిపించేదని ప్రశ్నించారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని, యావత్ దేశ చరిత్రకు సంబంధించిందని ఆయన అన్నారు.
‘‘ఒక వ్యక్తి చనిపోయాక, అతనిపై ఉన్న శత్రుత్వాలు అన్ని నశిస్తాయి. కానీ ఇక్కడ రాజకీయం జరుగుతోంది. అటల్ జీ అంత్యక్రియలు తర్వాత స్మారక చిహ్నం రాజ్‌ఘాట్ వద్ద నిర్మించబడదని, వేరే చోట నిర్మిస్తామని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది.? ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశ చరిత్రకు సంబంధించింది’’ అని సిద్ధూ విలేకరుల సమావేశంలో అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కేటాయింపు అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీని నిందించారు. రాజ్‌ఘాట్ కాకుండా నిగంబోధ్ ఘాట్‌లో ఏ మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. దేశం మొత్తం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలోనే ఆయన స్మారకం నిర్మించాలని కోరుకుందని, ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, పంజాబ్, సిక్కులు, ఈ దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల డిమాండ్ అని అన్నారు. దీని గురించి ముందుగానే ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బీజేపీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు వెతుకుతోందని అన్నారు. మాజీ ప్రధానిని ఎప్పుడూ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం కానీ ఏ నాయకుడిని గౌరవించకపోవడం కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మదన్ మోహన్ మలవియా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న ఇచ్చి మోడీ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!