Kazakhstan Plane Crash: అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఎంబ్రేయిర్-190 విమానం రష్యాకు వెళ్తూ కజకిస్తాన్‌లో కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారియి. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.న ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే, ఈ విమానం ప్రమాదంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. రష్యా ఉపరితలం నుంచి ఏదైనా క్షిపణి ఢీకొట్టడం వల్లే క్రాష్ అయినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ ఫైర్ చేయడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందనే రిపోర్టులు వెలువడుతున్నాయి. అయితే, రష్యా మాత్రం దీనిని కొట్టిపారేసింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, అజర్ బైజాన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వెబ్‌సైట్ కాలిబన్ నివేదిక ప్రకారం.. పాంసీర్-ఎస్ వైమానికి రక్షణ వ్యవస్థ నుంచి వచ్చిన క్షిపణి విమానాన్ని కూల్చిందని పేర్కొంది.
Read Also: Swiggy Instamart: హైదరాబాద్‌లో “స్విగ్గీ ఇన్‌స్టామార్ట్” హవా.. 2024లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారంటే?
విమానం కూలిన ప్రాతంలో దాని ముక్కు భాగంలో క్షిపణి దాడికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్, ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. విమానం బలమైన ‘‘జీపీఎస్ జామింగ్’’ని ఎదుర్కొందని, విమానం గంట పాటు ఆకాశంలో ఎత్తును కొనసాగించేందుకు కష్టపడిందని చెప్పింది. దాని వర్టికల్ స్పీడ్ డేటా గ్రాఫ్‌ని చూస్తే కూలిపోయే ముందు అకాస్మత్తుగా ఎత్తును కోల్పోయిందని చెప్పింది.
ప్రయాణికుల వాగ్మూలం ప్రకారం..గ్రోజ్నీ వద్దకు చేరుకున్న సమయంలో పెద్దగా ఒక చప్పుడు వినిపించిందని రాయిటర్స్‌లో ఒక ప్రయాణికుడు చెప్పారు. పెద్ద చప్పుడు తర్వాత విమానం అసాధారణంగా ప్రవర్తించినట్లు చెప్పాడు. అయితే, రష్యాకు చెందిన ఏవియేషన్ వాచ్‌డాగ్ రోసావియాట్సియా.. విమానాన్ని ల్యాండ్ చేయడానికి కెప్టెన్‌కి ఇతర విమానాశ్రయాలు చూసించామని చెప్పింది. కజకిస్తాన్‌కి చెందిన అక్టౌని ఎంచుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. 2014లో తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ఒబ్లాస్ట్ మీదుగా ఎగురుతున్నప్పుడు, రష్యా మద్దతు ఉన్న గ్రూపులు మలేషియన్ ఎయిర్ లైన్స్ MH17ని క్షిపణితో కూల్చేశాయి. బోయింగ్ 777 విమానంలోని 283 మంది ప్రయాణికులు 15 మంది సిబ్బంది మరణించారు.