Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Read Also: Germany: జర్మనీ పార్లమెంట్ రద్దు.. 7 నెలలకు ముందే ఎన్నికలు!
ఆ సమయంలో సంకీర్ణంలో పదవుల కేటాయింపు ఎలా ఉంటుందనే విషయాన్ని మన్మోహన్ సింగ్ చెప్పకనే చెప్పారు. 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ఎ రాజా ద్వారా ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ (FCFS) విధానాన్ని ఎలా అమలు చేశారనే విషయం తనకు తెలియదని చెప్పారు. లైసెన్సులు ఎవరు పొందారు, ఏ విధంగా పాలసీ అమలు చేశారు..? అనేది తనకు కానీ క్యాబినెట్‌కి కానీ తెలియమని, ఇది టెలికాం మినిస్టర్ ఏ రాజా నిర్ణయమని ఆయన చెప్పారు.2008లో, ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు దాదాపు 122 2G స్పెక్ట్రమ్ లైసెన్స్‌లు జారీ చేయబడ్డాయి. 2009లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లైసెన్సుల కేటాయింపులో అక్రమాలపై ధ్వజమెత్తింది. ఈ కేటాయింపుల వల్ల రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది.
ఈ ఆరోపణలతో రాజా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఆరోపణలతో అరెస్ట్ కూడా అయ్యారు. అయితే, 2018లో ప్రత్యేక న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ యూపీఏ-2 క్యాబినెట్ నుంచి రాజాను ఎందుకు తొలగించలేదనే ప్రశ్నకు సమాధానంగా, సంకీర్ణ సర్కార్ క్లిష్టంగా ఉంటుందని ఉదహరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే కేంద్రమంత్రి వర్గం కోసం ఏ రాజా, దయానిధి మారన్ పేర్లను సూచించిందని చెప్పారు.