Bank Holidays In January: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందు దేశవ్యాప్తంగా అందరూ సిద్ధమయ్యారు. అయితే, 2025 జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండటంతో ముందుగా మన లావాదేవీలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. జనవరిలో దాదాపుగా బ్యాంకులకు 15 రోజుల పాటు సెలువులు ఉంటున్నాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 తేదీతో బ్యాంక్ సెలవులు ప్రారంభమవుతున్నాయి.
కొత్త సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ సెలవులను ఆర్బీఐ అధికారికంగా విడుదల చేయలేదు. త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ జనవరి నెలలో సెలవులకు సంబంధించిన వివరాలను కస్టమర్ల సౌలభ్యం కోసం ఇవ్వడం జరిగింది. ఈ సెలవు దినాల్లో బ్యాంకులు మూసేసి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ సేవల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు.
జనవరి 2025లో బ్యాంక్ సెలవులు ఇవే:
1 జనవరి 2025, బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం – దేశవ్యాప్తంగా సెలవు
6 జనవరి 2025, సోమవారం: గురు గోవింద్ సింగ్ జయంతి – పలు రాష్ట్రాల్లో సెలవు
11 జనవరి 2025, శనివారం: మిషనరీ డే – మిజోరంలో సెలవు
11 జనవరి 2025, శనివారం: రెండవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు
12 జనవరి 2025, ఆదివారం: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్‌లో సెలవు
13 జనవరి 2025, సోమవారం: లోహ్రీ – పంజాబ్,ఇతర రాష్ట్రాల్లో సెలవు
14 జనవరి 2025, మంగళవారం: సంక్రాంతి – అనేక రాష్ట్రాల్లో హాలిడే
14 జనవరి 2025, మంగళవారం: పొంగల్ – తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
15 జనవరి 2025, బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం – తమిళనాడులో హాలిడే
15 జనవరి 2025, బుధవారం: తుసు పూజ – పశ్చిమ బెంగాల్, అస్సాం
23 జనవరి 2025, గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి – అనేక రాష్ట్రాలు
24 జనవరి 2025, శనివారం: నాల్గవ శనివారం – భారతదేశం అంతటా హలిడే.
26 జనవరి 2025, ఆదివారం: గణతంత్ర దినోత్సవం – దేశవ్యాప్తంగా హాలిడే
30 జనవరి 2025, గురువారం: సోనమ్ లోసర్ – సిక్కింలో హలిడే.