Joe Biden: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా నిలబడిన డెమొక్రాట్ అభ్యర్థి, ఉపఅధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. నిజానికి ముందుగా ట్రంప్‌కి పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని అనుకున్నప్పటికీ, డెమొక్రటిక్ పార్టీ పట్టుబట్టీ మరి కమలా హారిస్‌కి అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చింది.
Manmohan Singh Cremation: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, వివాదం మాత్రం చల్లారడం లేదు. మన్మోహన్ సింగ్‌కి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్మారక చిహ్నం విషయంలో అవమానపరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన దహన సంస్కారాలు రాజ్‌ఘాట్‌లో కాకుండా ఢిల్లీలోని నిగంభోద్ ఘాట్‌లో నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది. Read Also: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు […]
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Canadian Plane: ప్రపంచవ్యాప్తంగా వరసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికుల్లో గుబులు రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలో రెండు విమానాలు కుప్పకూలాయి. కొన్ని రోజుల క్రితం అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం బాకు నుంచి రష్యాకు వెళ్తుండగా కజకిస్తాన్‌లో కుప్పకూలింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. తాజాగా ఆదివారం రోజు మరో డెడ్లీ విమాన ప్రమాదం జరిగింది. సౌత్ కొరియా విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండిగ్ గేర్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో […]
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో ఝాన్సీలో ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్‌ని చితకబాదాడు. ప్రైవేట్ స్కూట్ టీచర్ క్లాస్ రూపంలో పోర్న్ వీడియోలు చూడటాన్ని చూసిన విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుల్దీప్ యాదవ్ అనే టీచర్ క్లాస్ రూంలో అసభ్యమైన కంటెంట్ చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన అతను బాలుడిని కొట్టాడు.
Borewell Incident: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఆదివారం ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’ జరగనుంది. యూనినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనన్తో నెతన్యాహూ బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. బుధవారం హడస్సా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత, ఆయన ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ కారణంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తేలింది.
H-1B Visa: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్‌కి మద్దతు తెలిపారు.
Saraswati River: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ ప్రాంతంలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఏకంగా భూమి నుంచి భారీగా నీరు బయటకు వచ్చింది. ఏకంగా ఈ నీటిలో ఓ జలాశయమే ఏర్పడింది. ఎడారి ప్రాంతంలో భూగర్భం నుంచి ఇంత స్థాయిలో నీరు బయటకు రావడం ఇప్పడు వైరల్‌గా మారింది.
South Korea: కజకిస్తాన్ విమానం ఘటన మరవక ముందే, దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 179 మంది విమాన ప్రయాణీకులు మరణించారు. బోయింగ్ 737-800 విమానంలో వరసగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రన్ వే నుంచి వేగంగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టింది.