Taliban: పాకిస్తాన్‌పై తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన..
- పాకిస్తాన్‌పై సంచలన ప్రకటన చేసిన తాలిబన్లు..
- ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం పాకిస్తాన్‌ది కాదన్న ఆఫ్ఘన్ రక్షణ శాఖ..
- ఇరు దేశాల మధ్య పెరిగిన టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Read Also: Canadian Plane: రఫ్ ల్యాండింగ్.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన కెనడా విమానం..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ఈ వారం ప్రారంభంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) రహస్య స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మంది ప్రజలు చనిపోయారు. దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు. దాదాపుగా 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుని పాకిస్తాన్ భూభాగం పరిగణించడం లేదని, అది తమదే అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారిజ్మీ అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను వేరు చేసే ‘‘డ్యూరాండ్ లైన్’’ని ఆఫ్ఘన్ ఎప్పటి నుంచో ఒప్పుకోవడం లేదు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం కూడా తమదే అని ఆఫ్ఘన్ వాదన. శుక్రవారం ఖోస్ట్, పక్తికా ప్రావిన్సుల నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్, కుర్రం ప్రాంతాలపై తాలిబన్లు దాడులు చేశారు.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!