H-1B Visa: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్‌లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్‌కి మద్దతు తెలిపారు.
Read Also: Director Maruthi : డైరెక్టర్ మారుతి నెక్ట్స్ టార్గెట్ అతడే.. ఇప్పటికే కథ రెడీ
తాజాగా H-1B వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనె ఎల్లప్పుడు (H1-B) వీసాలను ఇష్టపడుతున్నాను, నేను ఎల్లప్పుడూ వీసాలకు అనుకూలంగా ఉంటాను, అందుకే మేము వాటిని కలిగి ఉన్నాము’’ అని అన్నారు. స్వయంగా H1-Bలో దక్షిణాఫ్రికా నుండి వలస వచ్చిన మస్క్.. స్కిల్డ్ వర్కర్లు, వారి ప్రతిభను ఆకర్షించడం అమెరికా గెలుపొందడానికి చాలా అవసరం అని గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ట్రంప్ పరిపానలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానానికి భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మస్క్ స్నేహితుడు శ్రీరామ్ కృష్ణన్‌ని నియమించడంతో వివాదం ప్రారంభమైంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డ్‌పై ఉన్న పరిమితుల్ని తొలగించాలని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులకు రుచించడం లేదు. కరుగుగట్టిన రైటిస్ట్ నేత లారా లూమర్ శ్రీరామ్ నియామకాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది భారత విద్వేష వైఖరిని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ H-1B వీసాకి మద్దతు తెలపడం కీలకంగా మారింది. ముఖ్యంగా భారతీయులకు ఇది ఎక్కువ ప్రయోజనంగా మారే అవకాశం ఉంది.