Manmohan Singh: భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సో
USA: అమెరికాలో న్యూ ఓర్లీన్స్లో ఉగ్ర ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
Delhi Cafe Owner Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య నిఖితా సింఘానియా వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 పేజీల సూసైడ్ లేఖతో పాటు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేసి, భార్య ఆమె కుటుంబం వేధింపులను చెప్పాడు.
Israel: 2023 అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడి దారుణమై దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. పడుకొని ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అత్యంత కిరాతకంగా ఇజ్రాయిలీలను హతమార్చారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా, 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం హమాస్ లక్ష్యంగా గాజాతో పాటు ఇతర […]
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
AAP vs BJP: న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీ మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశిస్తూ, ఆర్ఎస్ఎస్కి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. బీజేపీ చర్యలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా..? అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి లేక రాశారు.
Shocking: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలోని ఒక హోటల్లో తన తల్లిని నలుగురు చెల్లెళ్లను ఓ వ్యక్తి ఘోరంగా హత్య చేశాడు. 24 ఏళ్ల వ్యక్తి తన చెల్లెళ్లు ‘‘అమ్మబడటం’’ ఇష్టం లేకనే హత్యలు చేశానని చెప్పడం సంచలనంగా మారింది. హత్యలు చేసిన తర్వాత హత్యలకు కారణాలను ఓ వీడియోలో చెప్పాడు. అర్షద్ అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. అర్షద్ సొంతూరు బుదౌన్‌లోని పొరుగువారు, ల్యాండ్ మాఫియా కలిసి తమ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని, తన చెల్లెళ్లను నిర్బంధించాలని ప్లాన్ చేసినట్లు…
BJP: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. తాజా, బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. సందేశ్‌ఖాలీలో జరిగిన దురాగతాలపై విచారణ జరుపుతామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆయన అన్నారు.
Xi Jinping: తైవాన్‌కి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ‘‘ పునరకీకరణను ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు. గత కొంత కాలంగా చైనా, తైవాన్‌ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. తైవాన్ చుట్టూ చైనీస్ మిలిటరీ కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు చైనా వ్యూహాన్ని స్పష్టం చేశాయి.
Christmas Cake: బ్రెజిల్లో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. క్రిస్మస్ కేకులో అత్యంత విషపూరితమైన ‘‘ఆర్సెనిక్’’ని కలిపి ముగ్గురిని చంపేసింది. 61 ఏళ్ల వృద్ధురాలు క్రిస్మస్ కోసం స్వయంగా కేక్ తయారు చేసింది. బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమయిన రియో గ్రాండే డో సుల్‌లోని టోర్రెస్కి చెందిన టెరెజిన్హా సిల్వా డోస్ అంజోస్ అనే మహిళ కేసు తయారు చేసే సమయంలో ఆర్సెనిక్ కలిపింది.